నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటా సిపిఎం పార్టీ అభ్యర్థి జహంగీర్
తిరుమలగిరి 24 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- పార్లమెంటు ఎన్నికల్లో మతోన్మాద బిజెపిని, అవకాశవాద కాంగ్రెస్ ను, అవినీతి బిఆర్ఎస్ పార్టీ లను చిత్తుచిత్తుగా ఓడించాలని భవనగిరి పార్లమెంట్ సిపిఎం పార్టీ అభ్యర్థి ఎండి జహంగీర్ అన్నారు. మంగళవారం తిరుమలగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తాను గత 35 సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీలో పని చేస్తూ ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్నానని అన్నారు. త్రాగు, సాగు అందించాలని,మూసి నదిని ప్రక్షాళన చేయాలని అనేక ఉద్యమాలు, పాదయాత్రలు నిర్వహించానని అన్నారు. నీతి నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తూ ప్రజా పోరాటాలే తన దినచర్యగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని అన్నారు. భువనగిరి గడ్డ కమ్యూనిస్టుల అడ్డా అని కమ్యూనిస్టులు నడయాడిన ఈ గడ్డలో వారి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ప్రజా నాయకునిగా ప్రజల మన్ననలు ముందుకు సాగుతున్నానని చెప్పారు. సిపిఎం పార్టీ పోరాటాల ఫలితంగా పేదలకు భూములు, ఇండ్ల స్థలాలు సాధించి పెట్టారన్నారు. మోడీ ప్రభుత్వం దేశంలో దేశ సంపదని ఉన్నత వర్గాలకు దోచి పెడుతూ అంబానీ, ఆదానిలకు ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్ముతున్నారని ఆయన అన్నారు. మతం పేరా దేవుళ్ళ పేరా విభజిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నాడనిఅన్నారు. దుర్మార్గమైన పాలనకు గోరి కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ప్రజలు మేలుకోకపోతే భారత రాజ్యాంగాన్ని మార్చి ఆ స్థానంలో మనువాదాన్ని తీసుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతాంగం గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడతా ఉంటే నల్ల చట్టాలు తేవాలని చాలా ప్రయత్నాలు చేశాడని దానికి రైతాంగం వేలాదిమంది దేశ నడిబొడ్డులో 13 నెలల పాటు సుదీర్ఘ పోరాటం చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప్పలయ్య లక్ష్మి తదితరులు పాల్గొన్నారు