**నియంతృత్వం పై పోరు""జర్నలిస్టుల ఐక్యత చాటుదాం"ఇండ్ల స్థలాల సాధనకు ఉద్యమం*

Mar 10, 2025 - 19:43
 0  74
**నియంతృత్వం పై పోరు""జర్నలిస్టుల ఐక్యత చాటుదాం"ఇండ్ల స్థలాల సాధనకు ఉద్యమం*

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం : *నియంతృత్వంపై పోరు* 

* జర్నలిస్టుల ఐక్యత చాటుతాం

* ఇండ్ల స్థలాల సాధనకు ఉద్యమం

* టీడబ్ల్యూజేఎఫ్ లో భారీగా చేరికలు

* సభ్యత్వ నమోదుకు భారీ స్పందన 

* ఖమ్మంలో జర్నలిస్టుల బైక్ ర్యాలీ.. అంబేద్కర్ కు నివాళి

 ఖమ్మం: 

   ఖమ్మంలో జర్నలిస్టులు కదం తొక్కారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సభ్యత్వ నమోదు సభకు విశేష స్పందన లభించింది. దాదాపు 300కు పైగా జర్నలిస్టులు తరలివచ్చి సభ్యత్వాలు నమోదు చేయించుకున్నారు. వివిధ జర్నలిస్టు యూనియన్ ల నుంచి టీడబ్ల్యూజేఎఫ్ లో పెద్ద సంఖ్యలో పాత్రికేయులు చేరారు. దీనికి ముందు ఖమ్మంలోని కాల్వొడ్డు జూబ్లీ క్లబ్ నుంచి రోటరీ నగర్ లోని సిటీ సెంట్రల్ ఫంక్షన్ హాల్ వరకు పెద్ద ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జూబ్లీ క్లబ్ వద్ద ఈ ర్యాలీని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య జెండా ఊపి ప్రారంభించారు. అక్కడి నుంచి పాత బస్టాండ్ సెంటర్ మీదుగా జడ్పీ సెంటర్ కు ర్యాలీ చేరుకుంది. అక్కడున్న అంబేద్కర్ విగ్రహానికి జర్నలిస్టులు నివాళి అర్పించారు. తిరిగి ప్రారంభమైన మోటార్ బైక్ ర్యాలీ ఇల్లందు క్రాస్ రోడ్ మీదుగా రోటరీ నగర్ లోని సభాస్థలికి చేరుకుంది. సభా ప్రారంభానికి ముందు యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి జక్కంపూడి కృష్ణ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఇటీవల కాలంలో మృతి చెందిన జర్నలిస్టులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పల్లా కొండలరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో రాష్ట్ర అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు రాజశేఖర్, పులిపలుపుల ఆనందం, బండి విజయ్ కుమార్, గుడిగ రఘు, కోశాధికారి ఆర్ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, టీడబ్ల్యూజేఎఫ్ లో నూతనంగా చేరిన సయ్యద్ ఖదీర్, దువ్వా సాగర్, ఆవుల శ్రీనివాస్, ఎగినాటి మాధవరావు, మానుకొండ రవి కిరణ్, కొత్త యాకేష్, కూరాకుల గోపీ, జానీపాష, తాళ్ళూరి రమేష్, పెండ్ర అంజయ్య, రాంపుడి నాగేశ్వరరావు, కొమెర వెంకటేశ్వర్లు, మధుశ్రీ, సంజీవరావు, సుభానీ, మాధవరావు, అయ్యప్ప తదితరులు ప్రసంగించారు. మొత్తం 196 మందికి పైగా జర్నలిస్టులు తొలిరోజు సభ్యత్వం తీసుకున్నారు. మొత్తం 285 మంది జర్నలిస్టులు సభకు హాజరయ్యారైనట్లు పేర్లు నమోదు చేసుకున్నారు.  

* నియంతృత్వంపై పోరు : బసవ పున్నయ్య 

ఓ రెండు జర్నలిస్ట్ యూనియన్లు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారికి వత్తాసు కొడుతూ.. జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపునయ్య ఆరోపించారు. నాయకులుగా లబ్ధి పొందుతూ.. జర్నలిస్టుల సమస్యలపై స్పందించకుండా... నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని తెలిపారు. నిరంకుశ విధానాలను వ్యతిరేకిస్తూ జర్నలిస్టుల సమస్యలపై నికరంగా పోరాడే టీడబ్ల్యూజేఎఫ్ ను ఆశ్రయిస్తున్నారని చెప్పారు. కొందరు నాటి, నేటి ప్రభుత్వంలో జర్నలిస్టుల సమస్యలను గాలికి వదిలి ప్రభుత్వాల వద్ద సైంధవుల పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. యూనియన్ నిర్మాణపరమైన అంశాలను సభ దృష్టికి తీసుకువచ్చారు.‌ ఇంత భారీగా తరలివచ్చి సభ్యులుగా చేరిన ప్రతి ఒక్క జర్నలిస్టుకూ టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. 

* ఏ సమస్య వచ్చినా అండగా ఉంటాం: మామిడి సోమయ్య

జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య హామీ ఇచ్చారు. నియంత పోకడలను వ్యతిరేకిస్తూ 2006లో ఫెడరేషన్ ఆవిర్భవించిందని, ఆనాటి నుంచి నేటి వరకు టీడబ్ల్యూజేఎఫ్ చేస్తున్న పోరాటాలను జర్నలిస్టులు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. జర్నలిస్టుల ప్రతి సమస్యపై నికరంగా పోరాడేది ఒక్క టీడబ్ల్యూజేఎఫ్ మాత్రమే అన్నారు. ఖమ్మంలో ఇంత భారీ సంఖ్యలో జర్నలిస్టులు టీడబ్ల్యూజేఎఫ్ లో చేరటం హర్షనీయమని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల విషయంలో ఖమ్మం జర్నలిస్టులను మభ్య పెట్టే రీతిలో కొందరు వ్యవహరించారని ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్ ఆరోపించారు. వాస్తవాలను జర్నలిస్టులకు వివరించి వారిలో చైతన్యం తీసుకొచ్చేలా టీడబ్ల్యూజేఎఫ్ వ్యవహరించిందని పేర్కొన్నారు. వందల సంఖ్యలో సభ్యత్వం తీసుకొని టీడబ్ల్యూజేఎఫ్ ను బలోపేతం చేస్తున్న ప్రతి ఒక్క జర్నలిస్టుకూ యూనియన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 

* రియల్ ఫైటర్స్ : ఎస్డీ ఖదీర్, దువ్వా సాగర్

జర్నలిస్టుల సమస్యలపై నికరంగా పోరాడే రియల్ ఫైటర్స్ టీడబ్ల్యూజేఎఫ్ లో చేరేందుకు ముందుకు రావడం గర్వకారణం అని నూతనంగా యూనియన్ లో చేరిన సయ్యద్ ఖదీర్ , దువ్వా సాగర్ వ్యాఖ్యానించారు. ప్రశ్నించే తత్వం ఉన్న జర్నలిస్టులను కొన్ని యూనియన్లు తట్టుకోలేని స్థితిలో ఉన్నాయని అన్నారు. వృద్ధ జంబూకాలున్న ఆ రెండు యూనియన్ ల నేతలు జర్నలిస్టుల ప్రయోజనాల కన్నా సుప్రయోజనాలకే విలువనిస్తున్నారని వ్యాఖ్యానించారు. జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా.. ఏ సమయంలోనైనా ఫోన్ చేస్తే ఇట్టే వచ్చి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం యూనియన్ రాష్ట్ర, జిల్లా నాయకత్వం టీడబ్ల్యూజేఎఫ్ చేరే జర్నలిస్టులకు కండువాలు కప్పి స్వాగతించారు. రాష్ట్ర నాయకులకు జిల్లా కమిటీతో పాటు నూతన సభ్యులు శాలువాలు కప్పి పూల మొక్కల ఇచ్చి సన్మానించారు. నాయకులంతా ఐక్యతను చాటుతూ చేయి చేయి కలిపి సమిష్టి అభివాదం చేశారు. సభ ప్రారంభానికి ముందు యూనియన్ కోశాధికారి తేనె వెంకటేశ్వర్లు అతిథులను వేదిక మీదకు ఆహ్వానించారు. చివరిలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బాలకృష్ణ వందన సమర్పణ గావించారు. కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ వ్యవస్థాపక జిల్లా అధ్యక్షులు పారుపల్లి కృష్ణారావు, ఉపాధ్యక్షులు గరిడేపల్లి వెంకటేశ్వర్లు, నాగుల్ మీర, విష్ణు, శ్రీధర్, రామకృష్ణ నాయక్, నాగమణి, రామచంద్రమూర్తి, పాష, అర్షద్, ఉపేందర్, ఫయాజ్, శరత్, సతీష్, రిషి, మూర్తి, నర్సింహారావు, పత్తి శ్రీను, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State