నిజాయితిని చాటుకున్న హోంగార్డ్ విష్ణు
ట్రాఫిక్ ఎస్సై చేతులమీదుగా ఫోన్ అప్పగింత.
జోగులాంబ గద్వాల ఆగస్టు3 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల పట్టణంలోని రాజీవ్ మార్గ్ నందు శనివారం హోంగార్డ్ విష్ణు విధులు నిర్వర్తిస్తున్న సమయం లో బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి మొబైల్ అనుకోకుండా ఆ వ్యక్తి ప్యాంట్ వెనుక జేబులో నుండి కిందకు పడిపోయింది. అప్పుడే అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ కు కనపడటం తో ఆ మొబైల్ ను తీసుకుని ట్రాఫిక్ కార్యాలయం లో ఉన్న ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు చేతికి ఇవ్వడం జరిగింది.ఆ వ్యక్తి తన మొబైల్ కు కాల్ చేయడంతో నీ మొబైల్ ఇక్కడ ఉంది రండి అని చెప్పడంతో ఆ వ్యక్తి ఆ మొబైల్ కి సంబంధించిన బాక్స్ మరియు ఇన్సూరెన్స్ పత్రాలు చూపించడంతో తనదే అని నిర్ధారణ కావడంతో ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు మరియు హోంగార్డ్ విష్ణు చేతుల మీదుగా ఆ వ్యక్తికి మొబైల్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా తన నిజాయితీని చాటుకున్న హోంగార్డును ట్రాఫిక్ ఎస్ఐ అభినందించారు. అనంతరం మొబైల్ పడెసుకున్న వ్యక్తి ట్రాఫిక్ ఎస్ఐకి మరియు హోంగార్డ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.