నిండు జీవితానికి రెండు పల్స్ పోలియో చుక్కలు...

Jun 28, 2026 - 20:08
Jun 29, 2026 - 00:36
 0  14
నిండు జీవితానికి రెండు పల్స్ పోలియో చుక్కలు...
నిండు జీవితానికి రెండు పల్స్ పోలియో చుక్కలు...

పోలియో రహిత సమాజం కోసం మనమందరం కలిసి ముందుకు సాగుదాం....

 ఐదు సంవత్సరాల లోపు ప్రతి ఒక్క చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా...

 ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె సంధ్యా కిరణ్మయి   మరియు

ఇమ్యూనికేషన్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మొహమ్మద్ అస్గర్ అలీ  మరియు వైద్య సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. 

 జోగులాంబ గద్వాల 28 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ సమీపంలో  MCH సెంటర్ (దూద్ దవఖాన) లో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. , అదనపు కలెక్టర్ నరసింహారావు  హాజరయ్యారు. ఎమ్మెల్యే  చిన్నారి లకు పల్స్ పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన 

 ఎమ్మెల్యే  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు  రాష్ట్రంలో రాష్ట్రవ్యాప్తంగా    పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అని అన్నారు. 
పోలియో బారిన పడే చిన్నారులను  కాపాడుకుంటూ వారికి ఆరోగ్యకరమైన జీవితం అందించిన  తల్లిదండ్రులు తమ ఐదేళ్ల పిల్లలకు తమ సమీపంలోని పల్స్ పోలియో కేంద్రాలకు వెళ్లి పల్స్ పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. తమ సమీపంలోని పల్స్ పోలియో కేంద్రాలు వెళ్లి పోలియో చుక్కలు వేయించుకోవడానికి వీలుకాకపోతే రేపు ఆరోగ్య సిబ్బంది తమ ఇళ్లకు వచ్చి పల్స్ పోలియో చుక్కలు వేశారని, తల్లిదండ్రులు తమ చిన్నారుల ఆరోగ్యం జీవితం కోసం తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. వంద శాతం చిన్నారులకు చుక్కలు వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

     ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మి నరసింహులు యాదవ్, కౌన్సిలర్స్  వేదవతి వెంకటేశ్వర్ రెడ్డి, చంద్రశేఖర్, mk సత్యం, సింగల్ విండో వైస్ చైర్మన్ విష్ణు, నాయకులు రిజ్వాన్, మోసిన్, నాగేంద్ర యాదవ్, చిరు, డి ఎం హెచ్ ఓ,వైద్య ఆరోగ్య సిబ్బంది, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State