నానో యూరియా అమ్మకాలు పెరగాలి

Aug 1, 2026 - 22:03
 0  0
నానో యూరియా అమ్మకాలు పెరగాలి
నానో యూరియా అమ్మకాలు పెరగాలి

రైతులు ఆరుతడి పంటలు సాగు  చేసేలా ప్రోత్సహించాలి. 

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

జోగులాంబ గద్వాల 1 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : యూరియాను అధిక మొత్తంలో వినియోగిస్తుండడంతో వ్యవసాయ క్షేత్రాలు సారవంతతను కోల్పోతున్నాయని, అన్నదాతలు నానో యూరియా ఎక్కువగా వినియోగించేలా వాటి అమ్మకాలను పెంచాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.

శనివారం ఎర్రవల్లి మండల కేంద్రంలోని వెంకటరమణ పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్,. సీడ్స్ దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ రకాల విత్తనాలు, ఎరువుల విక్రయాలు, వాటి ధరల గురించి దుకాణ యజమానిని అడిగారు. వివిధ స్టాక్ రిజిస్టర్ లను, పలు కూరగాయల విత్తనాల ప్యాకెట్లను పరిశీలించారు. యూరియాను ఆన్లైన్లో బుక్ చేస్తుండడంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సరఫరా చేయాలని ఆదేశించారు. రైతులు ఎక్కువగా నానో ఏరియా వినియోగించేలా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎల్ నినో నేపథ్యంలో వర్షాలు తక్కువగా కురుస్తుండడంతో రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలైన కందులు, కూరగాయలు, తదితర సాగుపై ఎక్కువగా 
దృష్టి సారించేలా ప్రోత్సహించాలన్నారు. పెస్టిసైడ్స్, సీడ్స్, ఫర్టిలైజర్స్ దుకాణాలను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరప్ప, ఏడిఏ సుబ్బారెడ్డి, ఏవో సురేష్ గౌడ్, ఏఈఓ నరేష్, తదితరులున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333