నాగర్ కర్నూల్ పార్లమెంట్ లో.. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన Dk అరుణ
తొలుత దక్షిణ కాశీ.. 5వ శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ అమ్మవారి దర్శనం.
జోగులాంబ అమ్మవారికి, బాల బ్రహ్మేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు.
జోగులాంబ గద్వాల 13 మార్చ్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. జిల్లా అలంపూర్లోని దక్షిణ కాశి..5వ శక్తి పీఠం జోగులాంబ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు Dk అరుణ. ఎంపీ రాములు, నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి భరత్. నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్న సందర్బంగా.. బుధవారం జోగులాంబ అమ్మవారిని, బాల బ్రహ్మేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన Dk అరుణమ్మకు ఎంపీ రాములు, బీజేపీ అభ్యర్థి భరత్ లను ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు సాధరంగా స్వాగతించి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం సన్మానించిన అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు అందరు విజయం సాధించి మరోసారి మోదీ ప్రధాని అయ్యేలా ఆశీస్సులు అందజేయాలనీ అమ్మవారిని వేడుకున్నారు dk అరుణమ్మ.
భారీ కాన్వయ్ తో..
అంతకు ముందు భారీ కాన్వయ్ తో జోగులాంబ ఆలయానికి వచ్చారు dk అరుణమ్మ, ఎంపీ రాములు, నాగర్కర్నూల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి భరత్. కామెంట్స్ తెలంగాణాలో మోదీ ప్రభంజనం మొదలైంది. ఈ తరుణంలో ప్రధాని మోదీ కి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని అమ్మవారికి మొక్కులు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ఎక్కువ స్థానాలు గెలుచుకునేలా అమ్మవారిని మొక్కుకున్నాం. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ స్థానాలు భారీ మెజారిటీ తో గెలుస్తాం. 16న నాగర్ కర్నూల్ లో ప్రధాని మోదీ ఎన్నికల సభను విజవంతం చేయాలి. మోదీ ప్రధాని అయితే నే దేశం అభివృద్ధి సాధ్యం. నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ ను భారీ మెజారిటీ తో గెలిపించాలి. బీజేపీ కి అలంపూర్ లో మంచి కేడర్ ఉంది అని బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు పేర్కొన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.