ధ్యానంతో విజ్ఞానం కె.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కోదాడ

Jan 8, 2025 - 18:13
Jan 8, 2025 - 18:47
 0  11
ధ్యానంతో విజ్ఞానం కె.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కోదాడ

తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ :- ధ్యానంతో విజ్ఞానం కే.ఆర్.ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాల కోదాడలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ మరియు హార్ట్ ఫుల్ నెస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు మూడో రోజు"హెల్ప్" కార్యక్రమం నిర్వహించడం జరిగింది.  కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ జి.లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా హార్ట్ ఫుల్ నెస్ సంస్థ సెంట్రల్ కో-ఆర్డినేటర్ కె .శివరామ ప్రసాద్ పాల్గొని "సరైన నిర్ణయాలతో సత్ఫలితాలు" అనే అంశంపై మాట్లాడారు. నిరంతరం సాధన తో ఫలితాలు సాధించవచ్చు అన్నారు. క్రమ పద్ధతిలో పఠనం చేయాలన్నారు. ఈర్ష, అసూయ, ద్వేషం,పగలను విడిచి పెట్టాలని, అందరూ స్నేహ భావంతో నడుచుకోవాలని అన్నారు.ధ్యానంతో విజ్ఞానం వస్తుందని అన్నారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ జి. లక్ష్మయ్య మాట్లాడుతూ... ఒక లక్ష్యంతో విద్యార్థులు సాగి ముందుకెళ్లాలని అన్నారు. ఒత్తిడిని అధిక మించినట్లయితే శాంతంగా ఉండవచ్చు అన్నారు. ఎకనామిక్స్ లెక్చరర్ ఆర్. పిచ్చిరెడ్డి మాట్లాడుతూ... ఎప్పటి పాఠాలు అప్పుడు చదివినట్లయితే విజయం మీదే అన్నారు. ధ్యానం చేయడం వలన ముఖాలలో తేజస్సు విస్తరిస్తుందని అన్నారు. హెల్ప్ సంస్థ వాలంటీర్ వెంకటరెడ్డి విద్యార్ధులతో ధ్యానం చేయించడం జరిగింది.   ఈ కార్యక్రమంలో ఆర్.పిచ్చిరెడ్డి,వేముల వెంకటేశ్వర్లు, జి. యాదగిరి, వి .బల భీమారావు, జి.నాగరాజు, ఆర్ .రమేష్ శర్మ, పి. రాజేష్, బి. రమేష్ బాబు,జి.వెంకన్న, పి. తిరుమల, ఎస్. గోపికృష్ణ, ఎం.చంద్రశేఖర్, సైదులు,ఎస్. కే. ముస్తఫా, ఎన్ .రాంబాబు, కె.శాంతయ్య, ఆర్. చంద్రశేఖర్, జ్యోతి, మమత, విద్యార్థులు పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State