సమస్యలు లేని అంగన్వాడీ సెంటర్లుగా తీర్చి దిగుతాం ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు

ఏపీ తెలంగాణవార్త ప్రతినిధి జగ్గయ్యపేట :- సమస్యలు లేని అంగన్వాడీ సెంటర్లుగా తీర్చిదిద్దుతా..ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య .జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో చిల్లకల్లు ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆఫీస్ నందు సిడిపిఓ లక్ష్మీ భార్గవి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రాజెక్టు మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ను ఉద్దేశించి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలకు, మరియు అంగన్వాడి ఆయాలకు సంక్షేమ పథకాలన్నీ వర్తించేటట్లు ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్తానని చెప్పినారు. అలాగే అంగన్వాడీ కేంద్రంలో తాగునీటి వసతి ,కాంపౌండ్ వాల్స్ మరియు మౌలిక సౌకర్యాలు అందరికీ వర్తించేటట్లు , స్థలాలు లేని అంగన్వాడి సెంటర్ లుగా చూస్తానని చెప్పడం జరిగింది. స్థలాలు లేని అంగన్వాడీ కేంద్రాలకు స్థలాలు ఇప్పించుటకు మరియు కాంపౌండ్ వాల్స్ నిర్మాణానికి కృషి చేస్తానని ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ తరఫున సరఫరా చేసిన ఫస్ట్ ఎయిడ్ కిట్ అలానే పిపి1,పిపి 2 పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించిన పుస్తకాలను ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అంగన్వాడీ కార్యకర్తల కు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమానికి తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి ఆచంట సునీత హాజరై అంగన్వాడీలకు అందవలసిన సంక్షేమ పథకాలు గురించి ఇంకా ఇతర సౌకర్యాలు గురించి 17వ తారీకు జరిగే క్యాబినెట్లో చర్చించి అన్ని ఆమోదం అయ్యేలా కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం జగ్గయ్యపేట మండల అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు, మరియు నాగమణి, సూపర్వైజర్లు మరియు అంగన్వాడీ కార్యకర్తలు హాజరయ్యారు.