తుమ్మిల్ల లిఫ్ట్ వద్ద సంపత్ కుమార్ నిరసన

Aug 6, 2024 - 18:43
Aug 6, 2024 - 18:48
 0  15

రసాభాసగా మారిన నీటి విడుదల కార్యక్రమం .

 నీళ్ళను వదిలేదాక యిక్కడి నుంచి కదిలేది లేదు అంటూ బైటాయింపు. 

 *రైతుల కళ్ళల్లో కాంతి చూడటం కోసం RDS కోసం రక్తం ధారబోసా.అంటూ 
సంపత్ కుమార్.**

జోగులాంబ గద్వాల 6 ఆగస్టు 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- ఈరోజు తుమ్మిల్ల ఎత్తిపోతల కేంద్రం నుంచి. నీటిని వదిలే కార్యక్రమం అధికారులు చేపట్టారు,
 ఈ కార్యక్రమాన్ని ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డా,SA సంపత్ కుమార్  హాజరయ్యారు అయితే స్థానిక ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు   దొంగచాటుగా అధికారులు నిర్దేశించిన  సమయం కంటే రెండు గంటల ముందే వచ్చి అధికారులను యిబ్బంది పెట్టి రాజకీయ లబ్ధి కోసం మోటార్లను ఆన్ చేసారు . .అప్పటికి యింకా  పైపుల ప్రేసర్ తగ్గించడానికి అవసరమయ్యే ఎయిర్ వాక్యూమ్ పేలాన్ సిద్ధంగా లేదు అని అధికారులు చెప్పినప్పటికీ ఎమ్మెల్యే విజయుడు వినిపించుకోకుం బటన్ నొక్కి ఫోటోలకు ఫోజులు కొట్టి అక్కడి నుంచి హుటాహుటిన  వెళ్ళిపోయారు .

అనంతరం అధికారులు పైప్ లైన్ వ్యవస్థ దెబ్బ తింటుంది అని వెంటనే  మోటార్లను ఆపివేశారు. అనంతరం అక్కడికి చేరుకున్న  సంపత్ కుమార్  అదికారుల సమన్వయంతో మోటార్లను తిరిగి ప్రారంభించాలని అనుకున్నారు .కానీ అధికారులు మోటార్లు సిద్ధం చేయడం కోసం సమయం అడిగారు .
యిదే అదునుగా భావించిన అల్పజ్ఞాని విజయుడు సంపత్ కుమార్  మోటార్లను ఆపివేసి నీటిని కిందకు వదలకుండా అడ్డుకుంటున్నారు అని రాజకీయ లబ్ది ప్రయోజనం కోసం నాటకం ఆడారు . యిది గమనించిన పోలీసులు ఎమ్మెల్యే విజయుడు అతని అనుచరులను పోలీసులు చెదరగొట్టి పంపించారు.

 రైతుల వరప్రదయిని అయినటువంటి తుమ్మిల్ల RDS కోసం సంపత్ కుమార్  నిర్విరామ పోరాటం చేసారు . విషయం తెలుసుకున్న సంపత్ కుమార్  అధికారులతో మాట్లాడి తిరిగి మోటార్లను ఆన్ చేయాలని అధికారులను. కోరగా వారు స్థానిక ఎమ్మెల్యే ఈరోజు నీటిని వదలవద్దు అని ఒత్తిడి చేస్తున్నారు అని తెలియజేశారు  దానికి సంపత్ కుమార్  నీటిని వదిలి రైతులకు న్యాయం చేసే వరకు నేను యిక్కడ నుంచి కధలను అని అక్కడే కూర్చుని రైతుల తో లిఫ్ట్  పైలాన్ ల వద్ద బైఠాయించి నిరసన తెలియజేశారు. వెంటనే కలెక్టర్ మరియు ,సంబధిత  ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి చర్చించి వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి  సంపత్ కుమార్  అధికారుల తో కలిసి ఎట్టకేలకు మోటార్లను ప్రారంభించి నీటికి కిందకు వదిలారు .దాంతో రైతులు బాణసంచా కాల్చి  సంబరాలు చేసుకున్నారు ..యిది కాంగ్రెస్ పార్టీ సంపత్ కుమార్ కి రైతుల పట్ల ఉన్న ప్రేమకి నిదర్శనం ..జై సంపత్ అన్న జై జై సంపత్ అన్న అంటున్న రైతులు ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు ఉన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State