తునికాకు సేకరణ కు టెండర్లు పిలిచి ఫ్రూనింగ్ పనులు వెంటనే చేపట్టాలి

Feb 15, 2025 - 19:31
Feb 16, 2025 - 16:24
 0  11
తునికాకు సేకరణ కు టెండర్లు పిలిచి ఫ్రూనింగ్ పనులు వెంటనే చేపట్టాలి

చర్ల 15/2/2025:       శనివారం:తునికాకు సేకరణ టెండర్లు వెంటనే పిలిచి తునికాకు ప్రూనింగ్ పనులు వెంటనే మొదలుపెట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి బందెల చంటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,చర్ల మండల కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం ,గిరిజన సంఘాల ఆధ్వర్యంలో తునికాకు కొమ్మ కొట్టే పనులు వెంటనే ప్రారంభించాలని 

చర్ల ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 

ఏజెన్సీలో రెండో పంటగా ఉన్న తునికాకు సేకరణ ద్వారా గిరిజన,గిరిజనేతర ప్రజలు ఉపాధి పొందుతున్నారన్నారుతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫారెస్ట్ అధికారులు టెండర్లు నిర్వహించడంలో, కొమ్మ కొట్టు పనులు చేపట్టడంలో జాప్యం చేస్తున్నారని విమర్శించారు , సకాలంలో కొమ్మ కొట్టు పనులు ప్రారంభించాలని లేనియెడల తునికాకు దిగుబడి తగ్గుతుందని ఏజెన్సీ ప్రాంతంలో తునికాకు పంటకు ఆధారపడినటువంటి కూలి బతుకులు బతుకుతూ ఎంతోమంది ఉన్నారని 2019 నుండి2023 వరకు తునికాకు పెండింగ్ బోనస్ బిల్లులు అవకతవకలు జరిగి అర్హులైనటువంటి వాళ్లకు అందలేదని దీనివలన చాలామంది అర్హులైన వాళ్లకు నష్టం జరిగిందని భవిష్యత్తులో అటువంటి అవకతవకలు జరగకుండా చూడాలని పెరుగుతున్న టువంటి ధరలకు అనుగుణంగా తునికాకు కట్ట రేటు పెంచాలని డిమాండ్ చేశారు ,ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు మచ్చ రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షురాలు ఊడుగుల షారోను,మండల నాయకులు దొడ్డి హరి నాగ వర్మ, గిరిజనసంఘం నాయకురాలు వరదల వరలక్ష్మి,ఐద్వా మండలకార్యదర్శి పొడుపు గంటి సమ్మక్క, తదితరులు పాల్గొన్నారు