తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో మొక్కను నాటిన డి.ఎస్.పి రవికుమార్...
తుంగతుర్తి జనవరి 6 తెలంగాణవార్త ప్రతినిధి :- తుంగతుర్తి మండల పరిధిలోని పోలీస్ స్టేషన్ లో తనిఖీ చేసిన డిఎస్పి రవికుమార్ నూతన పోలీస్ పెరేడ్ చూసి అభినందనలు తెలిపారు. సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తుంగతుర్తి పోలీస్ స్టేషన్ సందర్శించి అన్ని కేసులను తనిఖీ చేశారు అదేవిధంగా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారికి సలహాలు సూచనలు ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మీరు నీ సర్కిల్ పరిధిలోని కేసులను ఎప్పటికప్పుడు పరిశీలించి కోర్టుకు పంపియాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి పట్టణ ఎస్సై క్రాంతి కుమార్ ఏ..ఎస్సై.. పలువురు కానిస్టేబుల్ పాల్గొన్నారు.