తీన్మార్ మల్లన్న విడుదల కై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం

Jun 6, 2024 - 21:54
 0  143
తీన్మార్ మల్లన్న విడుదల కై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం

తిరుమలగిరి 7 జూన్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

తుంగతుర్తి నియోజకవర్గం,తిరుమలగిరి మండల కేంద్రంలోనీ వంగపెల్లి నరసయ్య ఫంక్షన్ హాల్లో తెలంగాణ ఉద్యమకారిణి హంస ఫౌండేషన్ చైర్మన్ చెరుకు లక్ష్మి ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న విడుదలకై అనే అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న తీన్మార్ మల్లన్న ఫాలోవర్ సర్దార్ రాజన్న మల్లన్న ను విడుదల చేయాలనీ మల్లన్న కోసం చేసిన ఉద్యమ పోరాటాలు రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన మాటలు గుర్తుకొస్తున్నాయని తిరుమలగిరి మండల కేంద్రంలోని గురువారం నాడు మార్పు సొసైటీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చారు ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే జైళ్ళ నోళ్ళు తెరవాల్సిందేనా?అంటూ సాగిన గడిచిన 10 సంవత్సరాల కాలంలో పాలించిన పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తూ ప్రభుత్వ సంస్థలను తనఖా పెడుతూ,ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తూ తెలంగాణ ప్రాంతాన్ని నిట్ట నిలువునా దోపిడీ చేస్తుంటే ఆకలినైయిన భరిస్తాము కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోమూ అని నినదించిన ఉద్యమ నేత ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న గత ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై తీన్మార్ మల్లన్న పోరాడుతుంటే అక్రమంగా అరెస్టు చేసి 72 రోజులు జైల్లో బంధించి హింసించిరన్నారు.నాటి నుంచి నేటి వరకు తీన్మార్ మల్లన్న ఏ నిర్ణయం తీసుకున్నా మల్లన్న ఫాలోవర్స్ గా మల్లన్న వెంటే నడుస్తూ వచ్చినమన్నారు నేడు తీన్మార్ మల్లన్న ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికై నామినేషన్ వేసిన నాటి నుండి ఎన్నిక మూగిసెంతవరకు ప్రచారంలో భాగస్వాములైన వారికి తీన్మార్ మల్లన్న గెలవాలని కృషిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ యొక్క ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న అఖండ మెజార్టీ పొంది విజయ దుందుభి మోగించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు ఆనాటి కార్యక్రమంలో మార్పు సొసైటీ వ్యవస్థాపకులు పోరెల్ల విప్లవ్ కుమార్,MRPS & MSP ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు కందుకూరి సోమన్న,NSUI సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కందుకూరి అంబేద్కర్,బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరు రాంప్రబు, బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు దీన్ దయాల్, హంస ఫౌండేషన్ సభ్యులు ప్రశాంత్,మల్లన్న టీం సభ్యులు, మల్లన్న ఫాలోవర్స్ తదితరులు పాల్గొన్న సందర్భాన్ని వివరించారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034