తుమ్మిల్ల లో తల్లిపాల వారోత్సవాలు
టీబీ నోడల్ పర్సన్ జయప్రకాష్
పిల్లలకు బాలామృతం తో పాటుగా పౌష్టిక ఆహారం అందించినపుడే వారు ఆరోగ్యంగా ఉంటారని రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టిబి నోడల్ అధికారి జయప్రకాశ్ తెలిపారు. ప్రపంచ తల్లీ పాల వారోత్సవాలు ను పురస్కరించుకొని ఆయన రాజోలి మండల పరిధిలోని తుమ్మిల్ల గ్రామము లో ఉన్న అంగన్ వాడి కేంద్రము లను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 1నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లీ పాల వారోత్సవాలు ను జరుగుతాయని ఆయన అన్నారు. పిల్లల ఎదుగుదల, వారి ఆరోగ్య బాగోగులు చూసుకుంటూ వారిని గుర్తించాలని సూచించారు, ఎదుగుదల తక్కువగా ఉన్న పిల్లలకు ప్రత్యేక పౌష్టిక ఆహారం తీసుకోవడం అవసరం ఉందని ఆయన అన్నారు. ఆంగన్ వాడి కేంద్రము ఆవరణం చుట్టూ ఉన్న చెత్త చెదారం ను తొలగించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పారు, దోమలు రాకుండా ఉండాలంటే కిటికీలకు జాలీ అమర్చుకోవాలని ఆయన అన్నారు, గర్భిణి స్త్రీలకు శిశువులకు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలని ఆయన అన్నారు. పిల్లలకు చదువు తో పాటుగా ఆట పాటలు నేర్పించాలని ఆయన మాట్లాడుతూ తెలిపారు, సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టిబి నోడల్ పర్సన్ జయప్రకాష్ తెలియజేశారు. ఈ కార్యక్రమం లో హెల్త్ అసిస్టెంట్ రంజిత్ కుమార్, ఆశా కార్యకర్తలు రాజేశ్వరీ,రామాలక్షమి, అంగన్ వాడి టీచర్లు విజయలక్షమీ, ఈశ్వరమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు...