తాటిపాముల బికేరు వాగును పరిశీలించిన ఇంజనీర్లు
తిరుమలగిరి 30 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామలోని వస్తా కొండూరు గ్రామానికి వెళ్లే దారిలోని బిక్కేరు వాగు పైన బ్రిడ్జి నిర్మాణం, చెక్ డాం కోసం ఐబీ అధికారులు డిజైనింగ్ చేయడానికి గురువారం బిక్కేర్ వాగులు పరిశీలించారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆదేశాలతో తుంగతుర్తి శాసనసభ్యులు మండల సామేలు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో తాటిపాముల గ్రామంలోని బిక్కెరు వాగు నుండి గుండాల మండలం వస్థా కొండూరు గ్రామానికి వెళ్లే దారిలోని వాగులో చెక్ డాం దానిపైన వాహనాలు వెళ్లడానికి బ్రిడ్జి నిర్మాణానికి సుమారు 15 నుండి 20 కోట్ల నిధులతో నిర్మించడానికి డిజైనింగ్ కోసం స్థలాన్ని పరిశీలించారు.
ఈ వాగు పైన బ్రిడ్జి నిర్మించినట్లయితే గుoడాల మండలంలోని వస్తా కొండూరు, బండ కొత్తపెళ్లి, పెద్ద పడిశాల గ్రామాల ప్రజలు తాటిపాముల గ్రామం నుండి తిరుమలగిరి మండల కేంద్రానికి రావడానికి దూరం వారం తప్పి సులువుగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా భిక్కేరు అవతల ఉన్న రైతులు వాగు ఉప్పొంగి వచ్చినప్పుడు పొలాల వద్దకు వెళ్లడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. డిజైనింగ్ పరిశీలనకు వచ్చిన వారిలో ఐబి చీఫ్ ఇంజనీర్ రమేష్ బాబు, ఎస్ ఈ ఈ శివధర్మతేజ, ఈ సత్యనారాయణ, డి సత్యనారాయణ, ఏఈ లు కాంగ్రెస్ నాయకులు ఎర్ర యాదగిరి నాని కృష్ణయ్య బోయపల్లి కిషన్, నాయినినర్సయ్య, పాల బిందెల లక్ష్మయ్య, సజ్జన్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.