పెనుగొండ వాసవి శాంతి ధామం లో ఈగా దయాకర్ గుప్త దంపతులకు సన్మానం 

Feb 21, 2024 - 19:16
 0  3
పెనుగొండ వాసవి శాంతి ధామం లో ఈగా దయాకర్ గుప్త దంపతులకు సన్మానం 

పెనుగొండ లోని అఖిల భారత శ్రీ వాసవి మాత మందిరంలో టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి నందుకు గాను సూర్యాపేట కు చెందిన శ్రీ వాసవిమాత  సేవా సమితి వ్యవస్థాపకులు,అద్యక్షులు ఈగ దయాకర్ గుప్త ,విజయ లక్ష్మి దంపతులను మంగళ వారం ఘనంగా సన్మాని0చ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ శ్రీ వాసవి శాంతి ధామం దేవాలయం ఐదవ వార్శికోత్సవం సందర్బంగా 3 రోజులు జరిగిన నేషనల్ వాసవి టెంపుల్ మీట్ కార్యక్రమానికి దేవాలయం వారి ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రముల లో గల పలు వాసవి దేవాలయాల్లో పూజలు అందుకుంటున్న  75 దేవాలయముల  నుండి తీసుక వచ్చిన  వాసవి మాత ఉత్సవ విగ్రహాలకు ఒకే వేదిక పై వేద పండితుల అధ్వర్యంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారని అందుకు గాను  కమిటీ అధ్వర్యంలో సన్మానం చేసినట్లు తెలిపారు.

 ఈగ దయాకర్ గుప్త గతం లో సూర్యాపేట లో ఇంటింట వాసవి మాత పారాయణం నిర్వహించుటకు తయారు చేయించిన  ఉత్సవ విగ్రహం ను పెనుగొండ కు తీసుకొని వెళ్లి అక్కడ జరిగిన పూజ కార్యక్రమాలలో పాల్గొన్న సందర్భముగా వారు  చేసిన సేవలకు గాను  సన్మానించారు.అంతే కాకుండా  గతం లో రాష్ట్రం లో మొట్ట మొదటి సారిగా శ్రీ వాసవి మాత వైభవాన్ని ఇంటింటా ప్రచారం చేయడమే కాకుండా శ్రీ వాసవిమాత లిఖిత జప పుస్తకాలను ముద్రించి దేశ వ్యాప్తంగా పంపిణి చేశారు.అందుకు గాను ఘనంగా సన్మానించారు.

ఈ నేషనల్ వాసవి టెంపుల్ మీట్ కార్యక్రమం లో భక్తులు దేశవ్యాప్తంగా పాల్గోన్నారు.దేశ ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ సైతం వేడుకల్లో  పాల్గొని అమ్మవారికి భక్తుల సహకారంతో తయారు చేయించిన 2 కిలోల బంగారు  కిరటానికి  ప్రత్యేక పూజలు నిర్వహించి  అందజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333