గుండాల నూతన ఎస్సైగా సైదులు బాధ్యతలు స్వీకరణ

Aug 5, 2026 - 22:26
Aug 5, 2026 - 23:18
 0  4
గుండాల నూతన ఎస్సైగా సైదులు బాధ్యతలు స్వీకరణ

గుండాల 06 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల పోలీస్ స్టేషన్ నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO)గా వి. సైదులు బాధ్యతలు స్వీకరించారు. వి. సైదులు గతంలో యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించి, బదిలీపై గుండాల పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించడం, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి