ప్రజావాణి పిర్యాదుల పై తీసుకున్న చర్యలను బాధితులు ఈ నంబర్ కు కాల్ చేసి తెలుసుకోవచ్చు
జిల్లా ప్రజలకు అందుబాటులో జిల్లా పోలీస్ కార్యాలయ రిసెప్షన్ ఫోన్ నెంబర్ 08546-273000
జిల్లా పోలీస్ కార్యాలయం కు వచ్చిన ప్రజావాణి పిర్యాదుల పై
తీసుకున్న చర్యలను బాధితులు ఈ నంబర్ కు కాల్ చేసి తెలుసుకోవచ్చు -జిల్లా ఎస్పీ రితిరాజ్,
జోగులాంబ గద్వాల 28 ఫిబ్రవరి తెలంగాణవార్త ప్రతినిధి:- ప్రజావాణిలో బాగంగా జిల్లా పోలీస్ కార్యాలయం కు వచ్చిన పిర్యాదుల పై పోలీస్ ఉన్నతాధికారులు తీసుకున్న చర్యలను తెలుసుకునేందుకు బాధితులు జిల్లా పోలీస్ కార్యాలయ రిసెప్షన్ నం 08546-2 73000కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అని జిల్లా ఎస్పీ రితిరాజ్,IPS . తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన పిర్యాదుల పై అధికారులు తీసుకున్నా చర్యలను ఎప్పటికప్పుడు బాధితులు తమకు కావాలంటే తెలుసుకునేందుకు రిసెప్షన్ నెంబర్ ను అందుబాటులోకి తేవడం జరిగిందని, పిర్యాదు దారులకు కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు. ప్రతి రోజు (ప్రభుత్వ సెలవులలో మినహా )ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 06:00 గంటల వరకు ఈ నెంబర్ అందుబాటులో ఉంటుందని , బాధితులు తమ పిర్యాదు పై పోలీస్ ఉన్నతాధికారులు చేపట్టినా చర్యలను ఈ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోవచ్చు అని జిల్లా ఎస్పీ తెలిపారు.