ఆపదలో సూర్యాపేట బిడ్డ కథనానికి స్పందించిన రాచర్ల కుటుంబం
జర్నలిస్ట్ చందన్ కుటుంబానికి ఒక లక్ష 25 వేళ ఆర్థిక సాయం అందజేసిన రాచర్ల కమలాకర్ - లక్ష్మి దంపతులు.
సూర్యపేట, 07 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- సమాజ సేవలోనే కాకుండా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి మేము సైతం ముందుంటాము అంటూ రాచర్ల కమలాకర్ లక్ష్మి దంపతులు ముందుకు వచ్చారు. సూర్యాపేట పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ తల్లాడ చందన్ కుమారుడు హయాన్ చంద్ర ఆటిజం సమస్యతో బాధపడుతుండగా అతనికి వైద్య ఖర్చులకు గాను ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుందని గుర్తించి ఒక లక్ష 25 వేళ రూపాయల ఆర్థిక సహాయాన్ని బాబుకు మెరుగైన వైద్యం అందించడానికి గాను కమలాకర్ లక్ష్మి ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా హయన్ చంద్ర తల్లిదండ్రులు తల్లాడ చందన్ - మంజుల దంపతులకు అందజేశారు. అమెరికాలో స్థిరపడ్డ హీరో షోరూం అధినేత రాచర్ల కమలాకర్ - లక్ష్మిల కూతురు అల్లుడు నరేంద్రుల కావ్య - శివశంకర్ దంపతులు ఒక లక్ష, వారి బావమరిది రాయపూడి లక్ష్మీనారాయణ - శోభ దంపతులు ద్వారా 25 వేలు మొత్తం లక్ష 25 వేళ రూపాయల చెక్కులను సోమవారం జిల్లా కేంద్రంలోని హీరో షోరూం లో అందజేసారు. ఈ సందర్భంగా రాచర్ల కమలాకర్ మాట్లాడుతూ.. జర్నలిజంలో రాణిస్తూ అందరి మన్ననలు పొందుతున్న చందన్ కుమారుడు హయన్ చంద్ర త్వరగా కోలుకుని అందరి పిల్లల్లాగా ఆడుకుంటూ ఉండేవిధంగా మారి వచ్చే వివాహ వార్షికోత్సవం నాటికి మంచిగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణానికి చెందిన ప్రముఖులు, లయన్స్ క్లబ్ సభ్యులు, వాసవి క్లబ్ సభ్యులు ఇంతటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గొప్ప దాతృత్వాన్ని చాటుకున్న కమలాకర్ - లక్ష్మి దంపతులను అభినందించారు.