ఏఎన్ఎం లకు పని ఒత్తిడి తగ్గించాలి...

Sep 6, 2025 - 21:06
 0  10
ఏఎన్ఎం లకు పని ఒత్తిడి తగ్గించాలి...
ఏఎన్ఎమ్రకి పనిబోతుడిని తగ్గించాలని పి ఎస్ సి డాక్టర్ కి వినతి పత్రం అందజేస్తున్న ఏఎన్ఎంలు

మునగాల 06 సెప్టెంబర్ 2025

తెలంగాణ వార్త ప్రతినిధి :హ

వైద్యఆరోగ్యశాఖలో విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎం లకు పని భారాన్ని తగ్గించాలని ఎన్సీడీ ఆన్లైన్ సేవలను మినహాయింపు ఇవ్వాలని కోరుతూ శనివారం మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  ఏఎన్ఎంలు . 8వ తారీఖున కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు అనుమతి ఇవ్వాలని డాక్టర్ వినయ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.ఆరోగ్య కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించేందుకు తాము కష్టపడుతున్నప్పటికీ ప్రభుత్వం ఆన్లైన్ సేవలతో పని ఒత్తిడి పెంచడంతో  మానసిక ఇబ్బందికి గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 8వ తారీఖునకలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి.అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు.ఎం నరసమ్మ ,ఏ ‌‌సుచరిత, ఎం లలిత,కే పద్మ , తదితరులు పాల్గొన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State