పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం""మోతే పిఎస్ సూర్యపేట జిల్లా
తెలంగాణ వార్త ప్రతినిధి మోతే : మోతే PS 30/4/2025....సిరికొండ గ్రామంలో మోతే పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నిర్వహించిన పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం నందు CI రామకృష్ణారెడ్డి సామాజిక అంశాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు, ఎస్ఐ యాదవెందర్, కళాబృందం పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నందు ప్రజలకు చట్టాల అమలు, జైలు శిక్షలు, వ్యక్తుల సత్ప్రవర్తన అంశాల గురించి వివరించారు. ఈ సందర్భంగా CI మాట్లాడుతూ జిల్లాలో జిల్లా పోలీస్ శాఖ నిర్వహిస్తున్న ప్రజా భరోసా కార్యక్రమాల సందర్భంగా ఈరోజు ఈ గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించడానికి వచ్చామని, ప్రజలందరూ కలిసి మెలిసి ఉండాలని, క్షణికావేశంతో స్వార్థంతో అత్యాశతో ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని నేరాలకు పాల్పడవద్దని కోరారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా గ్రామంలో నిఘా ఉంచాం అన్నారు. గ్రామం శాంతియుతంగా ఉంటే గ్రామ అభివృద్ధి జరుగుతుందని యువత భవిష్యత్తులో సన్మార్గంలో నడుస్తారని అన్నారు. సైబర్ మోసాలు రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కల్పించారు. మహిళలను గౌరవించాలని మహిళల పట్ల దాడులకు పాల్పడకూడదని కోరారు. నేర్వాలకు పాల్పడం వల్ల జీవితం జైలు పాలవుతుందని చట్టాలు బలోపేతంగా ఉన్నాయని ప్రతి ఒక్కరు సత్ప్రవర్తన కలిగి ఉండాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.