జిల్లా పోలీస్ కార్యాలయంలో 78వ ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Aug 15, 2024 - 19:24
 0  20
జిల్లా పోలీస్ కార్యాలయంలో 78వ ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జిల్లా పోలీస్ కార్యాలయంలో 78వ ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జిల్లా పోలీస్ కార్యాలయంలో 78వ ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జోగులాంబ గద్వాల 15 ఆగస్టు 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల. 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఉదయం 08.30 గంటలకు  జిల్లా పోలీస్ కార్యాలయం  నందు జిల్లా ఎస్పి శ్రీ టి . శ్రీనివాస రావు, ఐ.పి.యస్.  జాతీయ జెండాను ఎగరవేసి, సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేశారు.


     ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ సిబ్బందికి, జిల్లా ప్రజలకు 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు. మాతృ భూమి కోసం ఎందరో మహనీయులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసి బ్రిటిష్ వారితో పోరాడి, మనకు సమకూర్చి పెట్టిన ఈ స్వాతంత్ర్య భారత్ నేటితో 77 వసంతాలను పూర్తి చేసుకుందని, ఈ సందర్భంగా ఆ మహానీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పండుగలు మనం సమాజానికి ఏవిధంగా సేవాచేయాలని మన విధులను గుర్తు చేస్తాయని అన్నారు.పోలీస్ అధికారులు,సిబ్బంది పూర్తి బాధ్యతతో పని చెయ్యాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఒక్కరిని సమానంగా చూడటం, ప్రతి బాధితుడికి న్యాయం చేయగలిగినప్పుడే మనం సాధించుకున్న స్వాతంత్ర్య దేశానికి సార్థకత అని అన్నారు.  భిన్న భాషలు, భిన్న జాతులు, భిన్న మతాల కలయిక మన భారత దేశం అని, ఇన్ని విభిన్న సంస్కృతి, సాంప్రధాయలున్న వ్యక్తులు లేదా సమూహాల మధ్య సామరస్యం మరియు ఐక్యత భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుందని,  భారతీయులుగా పుట్టినందుకు మనందరం గర్వపడాలన్నారు. ప్రతి ఒక్కరు తన పని నీ మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్లాలని, ప్రజలు,ప్రభుత్వం పోలీస్ శాఖ నుండి ఆశిస్తున్న అంచనాలను అందుకోవాలని,మన విధులను అంకితభావంతో నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. తరవాత తెలంగాణ రాష్ర్ట ఆవిర్భవా దినోత్సవాన్ని పురస్కరించుకొని  జూన్-2 న  రాష్ర్ట వ్యాప్తంగా ప్రకటించిన సేవ పతకాలలో జిల్లా నుండి సేవ పతకాలకు ఎంపిక అయిన  ఏడుగురు అధికారులకు  జిల్లా ఎస్పీ  పతకాలు అందజేశారు.
సేవ పతకాలు అందుకున్న అధికారులు.
G.ఈశ్వరయ్య ASI 
S.రాజశేఖర్ ARSI 
P. వేంకటేశ్వర్లు HC 
P. రామి రెడ్డి, HC 
ప్రభాకర్ HC 
K. ఎల్ల శివ చారి AR HC 
B. శ్రీనివాస్ HC 
. స్వాతంత్ర్య దినోత్సవo ను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితoగా తీర్చి దిద్దేందుకు పాఠశాల,కళాశాలలకు నిర్వహించిన వ్యాసచన పోటీలలో జిల్లా స్థాయిల్లో నిలిచిన విద్యార్థులకు జిల్లా ఎస్పి గారు ప్రశంస పత్రాలను అందజేశారు.
1st విన్నార్ శిరీష, MPHW 2nd year, govt Jr కాలేజి , గద్వాల్.
2nd విన్నర్ రాజేశ్వరి,10th క్లాస్, ప్రభుత్వా బాలికల ఉన్నత పాఠశాల గద్వాల్,
3rd విన్నర్ శ్రావణి MPHW 2nd year, govt Jr కాలేజి. గద్వాల్,
అనంతరం నిన్న రాష్ట్రపతి మెడల్స్ కు ఎంపీక అయిన ఇద్దరు ఏ. ఎస్సై లు లక్ష్మయ్య, వేంకటేశ్వర్లు ను జిల్లా ఎస్పీ  అభినందించారు.

ఈ కార్యక్రమంలో  అదనపు.ఎస్పీ శ్రీ కె.గుణ శేఖర్ , డి.ఎస్పి సత్య నారాయణ, సైబర్ సెక్యూరిటీ వింగ్ డి.ఎస్పి సత్తయ్య, కార్యాలయ ఏ ఓ సతీష్ కుమార్, ఎస్బి ఇన్స్పెక్టర్ జమ్మూలప్ప, సీసీ ఎస్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర రెడ్డి , సైబర్ వింగ్ సీఐ రాజు, గద్వాల్ సిఐ భీమ్ కుమార్, ఆర్ ఐ వెంకటేష్ , ఐటీ, డిసి ఆర్బి, ఎస్బి, విభాగాల అధికారులు,సిబ్బంది  పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333