జాతీయ ఆదాయ ఆధారిత ప్రతిభా చాటిన లిఖిత్ శ్రీ హర్ష

Feb 27, 2026 - 22:28
Feb 28, 2026 - 19:58
 0  0
జాతీయ ఆదాయ ఆధారిత ప్రతిభా చాటిన లిఖిత్ శ్రీ హర్ష

*జాతీయ ఆదాయ ఆధారిత ప్రతిభా చాటిన లిఖిత్ శ్రీ హర్ష

 తెలంగాణ వార్త , (నుగూరు)వెంకటాపురం, ఫిబ్రవరి 27: జాతీయ ఆదాయ ఆధారిత ఎన్.ఎం.ఎం.ఎస్ ప్రతిభా ఫలితాల్లో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి చిట్యాల లిఖిత్ శ్రీ హర్ష అద్భుత ప్రతిభ కనబరిచి స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారు. ఈ స్కాలర్ షిప్ కు ఎంపిక అయిన చిట్యాల లిఖిత్ శ్రీహర్షను పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు పలువురు లిఖిత్ శ్రీహర్షను అభినందించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జివివి సత్యనారాయణ విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ..లిఖిత్ శ్రీ హర్ష మొదటి నుండి చదువులో ఎంతో చురుగ్గా ఉండేవారని,క్రమశిక్షణతో కూడిన కఠిన శ్రమ వల్లే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు.ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇలాంటి విజయాలు సాధించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

ఈ విజయం సాధించిన లిఖిత్ సాయి హర్షను,అతనికి మార్గదర్శకత్వం వహించిన ఉపాధ్యాయ బృందాన్ని, వారి తల్లిదండ్రులను అభినందించారు.విద్యార్థి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బి జయరాం,బి నాగమణి,సిహెచ్ఎస్ నరసింహారావు,రామకోటి, తల్లిదండ్రులు చిట్యాల చక్రి-రోజా తదితరులు పాల్గొన్నారు.

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్