జిల్లా కేంద్రంలో పోలీసు విస్తృత తనిఖీలు.
మాదకద్రవ్యాల నిర్మూలన తనిఖీలు.. తనిఖీల్లో పాల్గొన్న యాంటీ నార్కోటిక్ డాగ్ రోలెక్స్..
డ్రగ్స్, గంజాయి లాంటి మాదక ద్రవ్యాల నిరోధించడం లో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సూర్యాపేట పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో యాంటి నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సిబ్బంది విద్యా నగర్, 60 ఫీట్ల రోడ్, బస్టాండ్ ప్రాంతాల్లో ఉన్న టీ దుకాణాలు, పాన్ షాప్స్, హోటల్స్, లాడ్జిలో, హాస్టల్స్, పాఠశాలల నందు విసృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ఇన్స్పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపినారు. రెండు తెలుగు రాష్ట్రాలని కలుపుతూ ప్రధాన జాతీయ రహదారిపై రవాణా పరంగా ముఖ్య కేంద్రంగా ఉన్న సూర్యాపేట పట్టణంలో మెరుగైన భద్రత కల్పించడం, డ్రగ్స్, గంజాయి లాంటి మాదకద్రవ్యాలు, నిషేధిత పదార్థాల అక్రమ రవాణా నిరోధించడం, కొత్త వ్యక్తుల కదలికలు గుర్తించడం లో భాగంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించామని అన్నారు. గంజాయి డ్రగ్స్ లాంటి పదార్థాలు అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు చేశామన్నారు. మాదకద్రవ్యాలు గుర్తించే డాగ్ నార్కోటిక్ డాగ్ రోలెక్స్ తనిఖీల్లో పాల్గొని పాన్ డబ్బాలు, టి దుకాణాలు, అనుమానిత వస్తువులు, తనిఖీ చేయడం జరిగినది.