జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి తనిఖీలు
లాడ్జిల నందు విస్తృత తనిఖీలు చేసిన సూర్యాపేట పట్టణ పోలీసులు..
సూర్యాపేట 09 మే 2026 తెలంగాణవార్త రిపోర్టర్ :- అసాంఘిక కార్యకలాపాలు అనుమానత వ్యక్తులు, కొత్త వ్యక్తుల కదలికలు నిర్మూలన, నేరాల నిర్మూలనలో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు సూర్యాపేట డివిజన్ డిఎస్పి ప్రసన్నకుమార్, ఇన్స్పెక్టర్ వెంకటయ్య ఆధ్వర్యంలో శుక్రవారం అర్ధరాత్రి సూర్యాపేట పట్టణ పోలీసులు లాడ్జీల నందు తనిఖీలు నిర్వహించి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.. దీనిలో భాగంగా పట్టణంలో గల అన్ని లాడ్జిలను క్షుణ్ణంగా తనిఖీలు చేసి అందులో ఆశ్రయం తీసుకున్న వ్యక్తుల ఆధారాలను తనిఖీ చేశారు గతంలో ఏమైనా నేరాలకు పాల్పడిన చరిత్ర ఉందా అని ఆరా తీశారు. ఇలాంటి స్పెషల్ డ్రైవర్ నిర్వహించడం వల్ల కొత్త వ్యక్తుల కదలికలను నిర్మూలించవచ్చునని డిఎస్పి ప్రసన్న తెలిపారు. గుర్తింపు లేనటువంటి వ్యక్తులకు లాడ్జిలలో ఆశ్రమం ఇవ్వకూడదని రూములు ఇవ్వకూడదని యజమానులకు సూచించారు. ఎక్కువ రోజులు ఒకే వ్యక్తికి లాడ్జి ఇవ్వకూడదని ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు. లాడ్జిలను హోటల్స్ ను ఆశ్రయంగా చేసుకొని నేరాలకు దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉన్నదని గుర్తు చేశారు.