జర్నలిస్టుల సమస్యలు, అకిటేషన్స్ విషయంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిసెట్టి వినతి పత్రం

Mar 6, 2026 - 17:48
Mar 6, 2026 - 20:03
 0  20
జర్నలిస్టుల సమస్యలు, అకిటేషన్స్ విషయంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిసెట్టి వినతి పత్రం

ఖమ్మం జిల్లా రా వెళ్ళ::తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ (ఎన్ యు జె ఐ అనుబంధం సంస్థ)

రాష్ట్ర అధ్యక్షులు ఐ ప్రభాకర్ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఏం డి ఫసుద్దీన్ తో కలసి వినతి పత్రం అందించడం జరిగింది.

సానుకూలంగా స్పందించిన కలెక్టర్ అనుదీప్ దురుశెట్టి.

ఖమ్మం మార్చి 06,తెలంగాణ వార్త ప్రతినిధి

ది 06 మార్చి శుక్రవారం టి జె ఎం యు ఆధ్వర్యములో ఖమ్మం జిల్లా జర్నలిస్టులకు జరుగుతున్న అక్రిడేషన్ కు సంబంధించి న సమస్యలను జిల్లా కలెక్టర్&మేజిస్ట్రేట్,జిల్లా డి పి ఆర్ ఓ లను కలసి పలు సమస్యలపై వివరించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరడమైనది.

ఈ సమావేశములో వర్కింగ్ జర్నలిస్టులకు ఆర్ ఎన్ ఐ సర్టిఫికెట్ ను అనుసరించి ఎంపినల్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి చిన్న పత్రికల లో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు కు అక్రిడేషన్ లు ఇవ్వాలని,ఆరోగ్యపరంగా హెల్త్ కార్డులు,60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజెన్ లకు పెన్షన్ సౌకర్యం 10 వేలు ఇతర రాష్ట్రాల వలె సౌకర్యం కల్పించాలని,జిల్లాలో ఒక జర్నలిస్ట్ భవన్ కి స్తలం ఇచ్చి వసతితో కూడిన బిల్డింగ్ శాంక్షన్ చేయాలని, స్కూల్ ఫీజులో జర్నలిస్టుల పిల్లలకి 50 పరసెంట్ రాయితీతో కూడిన పద్ధతిని అమలు చేయాలని ఇంకా ఇతరమైన సమస్యలను వెంటనే అమలు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురుశెట్టికి వినతి పత్రం అందించడం జరిగింది.

ఈ కార్యక్రమములో జిల్లా అధ్యక్షులు ఏం డి ఫసుద్దీన్,వర్కింగ్ ప్రెసిడెంట్ రావెళ్ళ రవి కుమార్,కేసీరాజు వెంకటరాజు వైస్ ప్రెసిడెంట్,ఖమ్మం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజారత్నం,డివిజన్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు,వెంకట్,పలువురు కలెక్టర్ నీ కలసిన వారిలో ఉన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State