తపాల శాఖలో కొత్త నియామకాలు
సూర్యాపేట : తపాల శాఖలో కొత్త నియామకాలు చేపడుతున్నట్లు సూర్యాపేట డివిజన్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ జి సైదులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్సాహవంతులైన లక్ష్యం కోసం అకుంఠిత దీక్షతో పని చేయగలిగిన యువతీ యువకుల కోసం తపాల శాఖ సూర్యాపేట డివిజన్ సువర్ణావకాశం అందిస్తుందన్నారు. సూర్యాపేట డివిజన్లోని 347 పోస్టు ఆఫీసుల పరిధిలో కమీషన్ ప్రాతిపదికన పనిచేయుటకు 18 ఏండ్లు నిండి 10వ తరగతి ఉత్తీర్ణులైన ప్రతిభావంతులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి అనుభవం లేకపోయినా వారికి తగు శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తామన్నారు. ఎంపికైన వారు డివిజన్ పరిధిలో ఎక్కడైనా పనిచేసేందుకు అర్హులు అన్నారు. గృహిణిలు, పార్ట్ టైం ఉద్యోగులు, ఇతర ఇన్సు రెన్స్ కంపెనీల ఏజెంట్లు, పోస్టు ఆఫీసు ఏజెంట్లు కూడా ఈ ఏజెన్సీ తీసుకోవచ్చన్నారు. ఆకర్షనీయమైన కమీషన్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో సుమారు 100 మందికిపైగా ఏజెంట్లను నియమిస్తామన్నారు. ఆసక్తి కలిగిన వారు ఎస్ఎస్సీ మెమో, ఆధార్ కార్డు, పాస్ఫోటోలు తీసుకొని ఈ నెల 18న ఉదయం 10 గంటలకు సూర్యాపేట హెడ్ పోస్టు ఆఫీసులో జరుగు ఇంటర్య్యూలకు హాజరు కావాలన్నారు. మిర్యాల గూడెం హెడ్ పోస్టు ఆఫీసు పరిధిలోని ఈ నెల 19న ఉదయం 10 గంటలకు హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు 9985392675 నెంబర్ను సంప్రదించాలని కోరారు.