సిమెంటు బ్రిక్స్ ను ప్రారంభించిన కొత్త కళ్యాణ్ కుమార్

Jul 27, 2025 - 19:39
 0  99
సిమెంటు బ్రిక్స్ ను ప్రారంభించిన కొత్త కళ్యాణ్ కుమార్

చిన్నంబాయి మండలం వెలగొండ గ్రామంలో  సూర్య కుర్మయ్య  మరియు భారతి గారి ఆధ్వర్యంలో నిర్మించిన నూతన బ్రిక్స్ ఓపెనింగ్ కార్యక్రమం ఆదివారం ఉదయం ఘనంగా జరిగింది.

 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చి  ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ యువనేత కొత్త కళ్యాణ్ కుమార్.

 కొత్త కళ్యాణ్ కుమార్ ఆధ్వర్యంలో అతిథులుగా వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి, చిన్నంబావి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ , గ్రామ సీనియర్ నాయకులు మరియు మాజీ ఎంపీటీసీ మహదేవ్ గౌడ్ , నాగరాజు, మాజీ ఎంపీటీసీ అంజనేయులు, కాంగ్రెస్ నాయకులు జ్యోతి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బ్రిక్స్ ప్రారంభోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State