మాయగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దు...?

Jan 20, 2025 - 21:02
Jan 20, 2025 - 21:11
 0  44
మాయగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దు...?

కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిపై బీఆర్ఎస్ నేతల కుట్రలు...? 

 జిల్లా కోఆప్షన్ మాజీ సభ్యులు సయ్యద్ యూసుఫ్ 


టేక్మాల్ (మెదక్ ) అందోల్ నియోజకవర్గం తెలంగాణ వార్త ప్రతినిధి :- మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని  మెదక్ జిల్లా కోఆప్షన్ మాజీ సభ్యులు సయ్యద్ యూసుప్ కు    తెలంగాణ వార్త తెలుగు దిన పత్రిక ప్రతినిధి ప్రేమ్ కుమార్ చరవాణి ద్వారా సంప్రదించగా ఆయన మాట్లాడాతు పదేళ్లలో భారాస చేసిన అభివృద్ధి, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 11 నెలల్లో జరిగిన ప్రగతిపై చర్చకు సిద్ధమా  గత పది సంవత్సరాలలో బిఆర్ఎస్ చేయలేని అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి దూసుకెళ్తుంది అని ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేకే కొంతమంది బీ ఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.

వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి భారాస ఉండదని, హరీశ్రావు వేరే దారి వెతుక్కుంటున్నారని వ్యాఖ్యానించారు. భారాసలో మిగిలేది కేసీఆర్, కేటీఆర్, కవిత మాత్రమేనని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో ఏనాడైనా ప్రజల్ని కలిశారా అని ప్రశ్నించారు.  మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసేందుకూ సమయం   ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్లో కార్యకర్త కూడా సీఎంను కలిసే వెసులుబాటు ఉంటుందన్నారు. అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే 54 వేల మందికి ఉద్యోగాలిచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.

ఆందోల్ నియోజకవర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి అందోల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు ఉంచుతున్నారని ధీమ వ్యక్తం చేశారు. టేక్మాల్ మండలంలోని ఆయా గ్రామాలలో బీటీ రోడ్లు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. ఆందోల్ నియోజకవర్గం లోని ఆందోల్ మండలంలో కళాశాలలు, సంగుపేట్ హైవే రోడ్ నుండి అన్న సాగర్ వరకు హైవే పెద్ద రోడ్లు అవుతున్నాయని తెలిపారు. అభివృద్ధి చెందాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన ధీమ వ్యక్తం చేశారు. గ్రామసభల ద్వారా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు, ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. 200 యూనిట్ల కరెంటు, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం, ప్రజలకు ఎంతో మేలు జరిగిందని అన్నారు. ఆందోల్ నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ప్రతి ఒక్కరికి మంత్రి దామోదర్ రాజనర్సింహ అండగా ఉంటారని ఆయన అన్నారు. నియోజకవర్గం అభివృద్ధి మంత్రి దామోదర రాజ నరసింహ ఆధ్వర్యంలోనే అభివృద్ధి చెందుతుంది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కొత్త పాతని తేడా లేకుండా పార్టీ బలోపేతం కోసం అందరం కలిసి కృషి చేస్తున్నామని అన్నారు. త్వరలో టేక్మాల్ మండలంలో మరికొన్ని గ్రామాలలో బీటీ రోడ్లు మరియూ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభిస్తామని అన్నారు. అభివృద్ధికి మారుపేరు మంత్రి దామోదర రాజనర్సింహ అని ఆయన అన్నారు. ఏదేమైనప్పటికీ కూడా దామోదర్ రాజనర్సింహ హయంలోనే అభివృద్ధి చెందుతుందని మెదక్ జడ్పి కోఆప్షన్ మాజీ సభ్యులు సయ్యద్ యూసుఫ్ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై కానీ మంత్రి దామోదర్ రాజనర్సింహ పై బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తే తస్మాత్ జాగ్రత్త ఖబర్దార్... ఎందుకంటే అందోల్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అంటే కారణం మంత్రి దామోదర్ రాజనర్సింహ అని ఒక ప్రకటనలో తెలిపారు. బోరంచ మరియు బొగులంపల్లి ఎత్తిపోతల పథకం తెచ్చిన ఘనత దామోదర్ రాజనర్సింహదే జెఎన్టియు కళాశాలకు మరో ఐదు కోట్ల నిధులు కేటాయించిన ఘనత మంత్రి దామోదర్ రాజనర్సింహదే అని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333