చైల్డ్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం

Apr 13, 2026 - 19:52
 0  1
 చైల్డ్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం
 చైల్డ్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం

 జిల్లాలోని విద్యార్థులందరికీ రోడ్డు భద్రత మరియు సురక్షిత ప్రయాణానికి సంబంధించి అవగాహన కల్పించుట కొరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐ డి ఓ సి సమావేశ మందిరంలో మండల విద్యా శాఖధికారులు మరియు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల కు జిల్లా విద్యాశాఖ అధికారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి జిల్లాలోని 18 మండలాల మండల విద్య శాఖ అధికారులు మరియు సుమారు 70 ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ మాట్లాడుతూ పాఠశాలలు అన్నీ తప్పనిసరిగా స్కూల్ జోన్ అనే బోర్డు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్కూల్ కి వచ్చే రోడ్డుపై డివైడర్స్ కానీ స్పీడ్ బంప్స్ గాని ఏర్పాటు చేయాలని, ఈనెల 15వ తారీఖున జిల్లాలోని అన్ని పాఠశాలల్లో చైల్డ్ రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించి విద్యార్థులకు రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించాలని, ప్రైవేట్ పాఠశాలల బస్సులు తగిన విధంగా ఫిట్నెస్ ఉండేలా చూసుకోవాలని, పాఠశాలలో రకరకాల కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు అవగాహన  కల్పించాలని  సూచించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రూరల్ ఎస్సై అంజలి  మాట్లాడుతూ విద్యార్థుల ద్వారా వారి తల్లిదండ్రులు అందరూ, మరియు పాఠశాలల సిబ్బంది అందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా అవగాహన కలగజేయాలని, విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ వంటి పోటీలు నిర్వహించాలని వారిలో రోడ్ సేఫ్టీ పై అవగాహన పెంపొందించాలని సూచించారు. 
 
ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్ సాయి చరణ్  మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల బస్సులు తప్పనిసరిగా ఫిట్నెస్ ఉండేలా చూసుకోవాలని బస్సులలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఏర్పాటు చేయాలని పాఠశాలల్లో నిర్వహించే కార్యక్రమాలలో రవాణా శాఖ లేదా పోలీస్ సిబ్బందిని భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు. 

జిల్లా సైన్స్ ఆఫీసర్ బి అప్పారావు మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో రోడ్ సేఫ్టీ అంబాసిడర్ ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు ట్రాఫిక్ సిగ్నల్స్ కు సంబంధించిన డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిర్వహించాలని వాటిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని రోడ్ సేఫ్టీ డే రోజున రోడ్ సేఫ్టీ బ్లడ్ నిర్వహించాలని వినూత్న విధానంలో విద్యార్థులకు రోడ్డు మరియు భద్రత నియమాలు తెలియపరచాలని వాటికి సంబంధించిన పోస్టర్ కాంపిటీషన్స్ డ్రామా మరియు స్కిట్స్ నిర్వహించాలని తెలిపారు.
---------
డి.పి.ఆర్.ఓ.,మహాబాబాబాద్ చే జారీచేయనైనది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333