ఇందిరా మహిళా శక్తి పధకాలను సద్వినియోగం చేసుకోవాలి 

Apr 13, 2026 - 19:48
 0  2
ఇందిరా మహిళా శక్తి పధకాలను సద్వినియోగం చేసుకోవాలి 
ఇందిరా మహిళా శక్తి పధకాలను సద్వినియోగం చేసుకోవాలి 

రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళా సంఘాలకు అందజేస్తున్న పదకాలను సద్విని యోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ కె. సీతారామారావు తెలిపారు. 
 సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశం మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సెర్చ్, గృహనిర్మాణ శాఖ సంయుక్తంగా నేషనల్ అకాడమి ఆఫ్ కంస్ట్రక్షన్స్ (నాక్) ద్వారా ఇచ్చిన శిక్షణలో పాల్గొన్న లబ్దిదారులకు అదనపు కలెక్టర్ చేతుల మీదిగా సర్టిఫికేట్స్ లను అందించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ గృహ నిర్మాణాల్లో సభ్యులను భాగస్వాములుగా చేస్తూ వారికి అదనపు జీవనోపాధిని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించి నట్లు వివరించారు. సెర్చ్ ద్వారా సెంట్రింగ్ పనులలో అవగాహన కలిగిన మహిళా సంఘాల కుటుంబసభ్యులను గుర్తించి వారికి నాక్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వివరించారు. శిక్షణ పొందిన 30 మంది లబ్దిదారులకు ప్రభుత్వ సహకారముతో బ్యాంకు ఋణాలను అందజేసి సెంట్రింగ్ యూనిట్ ఎర్పాటు చేయించి గృహనిర్మాణ శాఖ ద్వారా వారికి ఇందిరమ్మ ఇండ్లకు సెంట్రింగ్ పనులు చేయించి వారికి ఉపాది అవకాశలు కల్పించడమే లక్ష్యం అని అన్నారు. దీంతో గ్రామాల్లో సెంట్రింగ్ పని చేయువారి కొరత తీరడంతో పాటు వారికి అదనపు జీవనోపాధి లబిస్తుందని తెలిపారు. 
ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ అదనపు పథక సంచాలకులు సురేష్, హౌసింగ్ ఎ.ఇ, అబ్దుల్, నాక్ సెంటర్ అడిషినల్ డైరెక్టర్ చింతమల్ల రమేష్, డీపీఎం అరుణ్ కుమార్, ఏపీఎం నగేష్ పాల్గొన్నారు.
--------------------------------------
 జిల్లా పౌర సంబంధాల అధికారి సూర్యాపేట వారిచే జారి చేయనైనది

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333