చెట్ల కొమ్మలు కొట్టారు.. ఎత్తడం మరిచారు

Mar 21, 2024 - 19:52
 0  3
చెట్ల కొమ్మలు కొట్టారు.. ఎత్తడం మరిచారు

రోడ్లపైనే చెట్ల కొమ్మలు..!

ప్రమాదానికి గురైతే కారుకులు ఎవరని అగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజానీకం..!

సిబ్బంది నిర్వకంతో ... ప్రజలకు తప్పని ఇక్కట్లు..!

v3 న్యూస్ స్టాఫ్ రిపోర్టర్
పుట్టా రాంబాబు గౌడ్ బాచి

సూర్యాపేట మున్సిపాలిటీలో టౌన్ వన్ టౌన్ 2 లో రాబోయే గాలి ధుమారాలను వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చెట్లు కొమ్మలను విద్యుత్ సిబ్బంది  తొలగించారు ... కానీ చెట్ల కొమ్మను తొలగించడం చేశారు కానీ ... ఒకరి మీద ఒకరు సాకుతో రోడ్లపై పడి ఉన్న కొమ్మలను  తీయడం మరిచారు.. కొట్టిన చెట్ల కొమ్మలను గతంలో మునిసిపాలిటీ సిబ్బంది తొలగించేవారు.. కాగా పెరిగిన వార్డులు దృష్ట్యా మున్సిపల్ సిబ్బందికి చెత్త వ్యర్ధాలు తొలగించడంలోనే సమయం లేదని చెప్తున్నట్లు సమాచారం...సూర్యాపేటలో విలీన గ్రామాలతో కలుపుకుని 48 వార్డులు పెరగడంతో ... మున్సిపల్ సిబ్బంది కొరత వేధిస్తుందని సమాచారం. ఇక్కడ నిర్ణక్ష వైఖరి ఒకరి మీద ఒకరు అన్నట్లుగా ప్రవర్తన ఉంది... చెట్లు కొమ్మలను రోడ్డుపై ఆ ప్రాంతాలలో వదిలివేయడంతో ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నా వీరు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నారు.. ఇప్పటికైనా కరెంటు సిబ్బంది అధికారులు స్పందించి చెట్ల కొమ్మలను రోడ్డుపై నుండి ట్రాక్టర్లను పెట్టుకొని తొలగించాలని  సూర్యాపేట మున్సిపాలిటీ  ప్రజలు సలహా,సూచనలు ఇస్తున్నారు....

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333