పల్లెల్లో ఏరులై పారుతున్న మద్యం పట్టించుకోని ఎక్సేంజ్ శాఖ అధికార యంత్రం.

Jul 27, 2024 - 20:53
 0  3
పల్లెల్లో ఏరులై పారుతున్న మద్యం పట్టించుకోని ఎక్సేంజ్ శాఖ అధికార యంత్రం.

జోగులాంబ గద్వాల  జిల్లాలో ప్రతి  పల్లెలలో  జోరుగా సాగుతున్న  బెల్ట్ షాపుల లో మందు విక్రయాలు పట్టించుకోని మైనం.. జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రతి మండలానికి ఒక ఎక్సైజ్ అధికారి ఎస్సై మరియు నలుగురు ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉంటారు అయితే ప్రతి అధికారి సైతం బెల్ట్ షాపులతో కుమ్ముకై మూడు పువ్వులు ఆరు కాయలుగా జీవులు నింపుకుంటున్నట్లు  పల్లెల్లో బెల్ట్ షాపులు విక్రయిస్తున్న యజమానులు చెప్పుకొస్తున్నారు, ప్రతి గ్రామంలో రెండు నుండి నాలుగు బెల్ట్ షాపులు విక్రయాలు. జిల్లాలో సుమారు 255 గ్రామపంచాయతీలు ఉండగా ప్రతి గ్రామంలో రెండు నుండి నాలుగు బెల్ట్ షాపులలో మద్యం  విక్రయిస్తున్నారు.

అధికారులు మాత్రం తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. కర్ణాటక నుండి రోజుకు భారీగా మధ్య  విక్రయం. అధికారులు మాత్రం  నిమ్మకి నీరు ఎత్తినట్లుగా వివారిస్తున్న  జిల్లా యంత్రాంగం.  పల్లెలలో ఎమ్మార్పీ కంటే అధిక రేట్లకు మధ్య  విక్రయిస్తుండడంతో రోజు కూలి పనులకు  చేసుకుని బతికేవారు గతి ఏంటని వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఓట్ల ముందు మాత్రం ప్రజాప్రతిని ధులు ఎన్నో హామీలు ఇస్తారు గానీ ఓట్లు అయిపోయిన తర్వాత మా గ్రామాలకు తిరిగి చూసే నార్దుడే కరువయ్యాడని వాపోతున్నారు పల్లె జనాలు.* మద్యం పక్క రాష్ట్రాలకు విక్రయాలు అయ్యే  ప్రాంతం. ఐజ. రాజోలి. అల్లంపూర్. పూలూర్  టోల్ ప్లాజా ప్రాంతాలలో జోరుగా ఇతర రాష్ట్రాలకు మద్యం  విక్రయాలు. కొందరు బెల్టు షాపులు నిర్వాహకులను వివరణ కోరగా మాకి మద్యం సప్లై చేసే వైన్ షాపులో యజమానులే ఎక్సైజ్ శాఖ అధికారులు చూసుకుంటారని చెప్పుకొస్తున్నారు... కొందరు  మద్యం షాపుల యజమానులే ఎక్సైజ్ శాఖ అధికారులకు ముడుపులు ముట్టిస్తుండడంతో ఇలాంటి బెల్ట్ షాపులు  పల్లెల్లో పుట్టగొడుగుల  వెలిచాయని. చెప్పుకొస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అధికారులపై మరియు ఇతర ప్రాంతాలకు సప్లై చేసే షాపుల యజమానుల పై  చర్యలు తీసుకోవాలని పల్లె ప్రజలు వేడుకుంటున్నారు... వారిపై చర్య తీసుకోకపోతే ఇలా పల్లెల్లో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూనే ఉంటారని కొందరు మేధావులు  చెప్పుకొస్తున్నారు..

వేచి చూడాల్సిందే మరి ఏమి జరుగుతుందో. Jg tv. నెక్స్ట్ అప్డేట్స్..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333