విజృంభిస్తున్న క్యాన్సర్ను  అదుపు చేయడానికి అవగాహన పెద్దమందు

Jul 25, 2024 - 10:05
Aug 26, 2024 - 17:45
 0  5
విజృంభిస్తున్న క్యాన్సర్ను  అదుపు చేయడానికి అవగాహన పెద్దమందు

పరిశోధనలు విస్తృతం చేయడంతో పాటు

తొలి దశలో గుర్తిస్తే ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధి నుండి  రక్షణ పొందవచ్చు. 

పేద వర్గాలకు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించడం ద్వారా  మరింత కట్టడి చేయవచ్చు  .

--వడ్డేపల్లి మల్లేషము

గుండెపోటు మరణాల తర్వాత  క్యాన్సర్ వల్ల  జరుగుతున్న మరణాలు రెండవ స్థానంలో ఉన్నట్టు  ప్రభుత్వ గ ణాంకాలు వెల్లడిస్తున్నాయి . ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్  విజృంభించడంతోపాటు భారతదేశంలోనూ దాని యొక్క తీవ్రత ఆందోళన కలిగించడం విచారకరం.  ఆర్థికంగా లేకపోయినా సంతోషంగా తృప్తిగా బ్రతుకుతున్న అనేక కుటుంబాలలో  క్యాన్సర్ మహమ్మారి ప్రవేశించడంతో  ఆ కుటుంబాలు అతలాకుతలం కావడమే కాకుండా  వీధి పాలవుతున్న పరిస్థితులను గమనిస్తే  ఆ విషాదము నుండి తే రుకోవడం చాలా కష్టం.
క్యాన్సర్  విజృంభించడానికి గల 34 కారణాలలో  ధూమపానం, మద్యపానం ,వాయు కాలుష్యము  ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు.  ముఖ్యంగా వాయు కాలుష్యంతో శ్వాసకోశ క్యాన్సర్ ముమ్మరంగా  వ్యాపిస్తున్న సందర్భంలో  మసాలా దినుసులు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు మద్యపానంతో  క్యాన్సర్లు సంభవించే అవకాశాలు ఎక్కువ అవుతున్నట్లు వైద్యుల పరిశోధనలో తెలుస్తున్నది . భారత్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి  అభివృద్ధి చెందుతున్న దేశాలలో  ధూమపానం పొగాకు ఉత్పత్తులను వినియోగించడం వల్ల పెదవి నోటి క్యాన్సర్  పే రుగుతున్నట్టు లాన్ సెట్ పత్రిక అధ్యయనంలో తేలింది.  క్యాన్సర్ అటాక్ కావడానికి  పొగాకు   ఉత్పత్తుల వినియోగం  ప్రధాన కారణమని తెలిపిన   ప్రపంచ ఆరోగ్య సంస్థ  పొగాకు వినియోగాన్ని దూరం చేయగలిగితే  40% క్యాన్సర్ కేసులను నివారించవచ్చునని  నిపుణుల అభిప్రాయపడుతున్నారు . భారతదేశంలో  గుండె శ్వాసకోశ వ్యాధుల తర్వాత మూడవ స్థానంలో క్యాన్సర్ వల్ల  ఎక్కువ మరణాలు సంభవిస్తున్నట్లు తొలి దశలో గుర్తించకపోవడం వల్ల  మరణాల సంఖ్య పెరుగుతుందని తొలి దశలో గుర్తించగలిగితే  కనీసం 20 నుండి 30 సంవత్సరాలు  జీవించడానికి అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భారత్లో క్యాన్సర్ పరిస్థితి  కొన్ని వివరాలు '-

ఒక అంచనా ప్రకారం భారతదేశంలో 2019లో 12 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదైతే  అదే సంవత్సరం ఆ మహమ్మారి  కారణంగా సుమారు  9 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు  ఆసియాలో మొత్తం మీద  చైనా తర్వాత భారతదేశం క్యాన్సర్ మరణాల్లో రెండో స్థానంలో ఉన్నట్లు ఇటీవల లాన్ సెట్ పత్రిక విడుదల చేసిన అధ్యయనం  తెలియజేస్తున్నది . ముఖ్యంగా మహిళల్లో  గర్భాశయ రొమ్ము  పెద్ద పేగు   ఉదర సంబంధిత క్యాన్సర్లు  ఎక్కువ తలెత్తినట్లు రక్త ,ప్రోస్టేట కాలేయ  క్యాన్సర్లు కూడా భారత్లో గణనీయంగా పెరిగినట్లు  తెలుస్తున్నది. .

ఇండియాలో ప్రస్తుతం 100 మందికి ఒక్కరే ముందస్తుగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం వలన చాలామంది  తెలియకుండానే ఈ రోగం బారిన పడుతుండడం ప్రాణాంతకంగా మారింది.  ప్రభుత్వమే ముందస్తుగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయడాన్ని సవాలుగా చేసుకున్నట్లయితే  ఈ ప్రమాదం నుండి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది.  జిల్లాస్థాయి ప్రాంతీయ  పెద్ద వైద్యశాలల్లో కూడా రోగనిర్ధారణ పరీక్షల సౌకర్యం లేకపోవడం,  పెద్ద పట్టణాలలో ప్రైవేటు వైద్యశాలల్లో మాత్రమే ఉండడం వలన  ఖర్చు పెట్టి పరీక్షలు చేయించుకోలేని పరిస్థితిలో అనేక పేద కుటుంబాలు దీని బారిన పడడాన్ని గమనించాలి. . .ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల ఆరోగ్యశ్రీ నిధులను భారీగా పెంచడంతోపాటు  కేంద్ర ప్రభుత్వం కూడా  పేదలకు క్యాన్సర్ చికిత్స కై  5 లక్షల రూపాయల ఆరోగ్య భీమా కల్పించేందుకు  ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను అమలు చేస్తున్నట్లుగా పత్రికల ద్వారా తెలుస్తున్నది కానీ దానికి సంబంధించిన విధివిధానాలను  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  సమగ్ర సమాచారం ఇవ్వడమే కాదు వైద్యశాలలు ఆరోగ్య కేంద్రాల  ద్వారా ప్రజలను చైతన్యం చేయవలసిన అవసరం చాలా ఉన్నది . వైద్య చికిత్సలు,  పరీక్షలు, శస్త్ర చికిత్సలు అలాగే మందులకు లక్షలాది రూపాయలు ఖర్చు చేయవలసి రావడం పేదలకు భారంగా పరిణమించిన వేళ  దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా ఈ వ్యాధికి ప్రభుత్వమే ఉచితంగా సౌకర్యం కల్పించినట్లయితే  క్యాన్సర్ ను ఈ దేశం నుండి తరిమి వేయడానికి ఆస్కారం ఉంటుంది.  అంతేకాకుండా నియోజకవర్గ స్థాయి నుండి జిల్లా రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి అన్ని ప్రధానమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రి లోపల చికిత్సలు , యంత్ర పరికరాలు,  మందులు, సౌకర్యాలను అందుబాటులో ఉంచడంతోపాటు  మందులను అతి చౌకగా అందించగలిగితే  క్యాన్సర్ బాధితులకు ఉపశమనం లభిస్తుంది.  అంతేకాకుండా దీనివల్ల ఒనాగూరే ప్రమాదాలను గోరంతను కొండంతలు చేసి చూపడం మానీ ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని రోగులలో పెంచే ప్రయత్నం జర  జరగాలి.  ఇటీవలి కాలంలో 18 రకాల క్యాన్సర్లకు సంబంధించి ప్రాథమిక స్థాయిలోనే గుర్తించేందుకు అమెరికా  పరిశోధన నిర్వహిస్తున్నట్లు  తెలిసింది  అలాంటి సాంకేతిక పరిజ్ఞానం అన్ని దేశాలకు తక్కువ ధరకే అందుబాటులోకి వస్తే  ముందస్తుగా నిర్ధారణ జరిగితే లక్షలాది మందిని  రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది . పౌర సమాజం బాధ్యతతో పాటు పాలకుల యొక్క  పట్టుదల  ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని ఆవిష్కృతం చేయాలనే తపన  ఈ దశలో ఎంతో ముఖ్యం.

(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ (చౌటుపల్లి).

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333