చిన్న పత్రికలకు అక్రిడేషన్ల విషయంలో

హైకోర్టు తీసుకున్న నిర్ణయం హర్షనీయం గడ్డం అంజి

Aug 12, 2024 - 17:53
Aug 12, 2024 - 18:10
 0  67


కోదాడ 13 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని మీడియా మిత్రుల సమావేశంలో గడ్డం అంజి మాట్లాడుతూ పెద్ద పత్రికలు పెద్ద మీడియాతో పాటు చిన్న పత్రికలను గుర్తించకుండా 2016 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం జీవో 239 ప్రకారంగా ఏబిసిడి వర్గీకరణ ప్రకారంగా కొనసాగించడం అనేది సరైన విధానం కాదని హైకోర్టు ఇచ్చిన అన్ని పత్రికలను సమానంగా గుర్తించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుకు గడ్డం అంజి వ్యక్తం చేశారు. అసలే జర్నలిస్టులు ఎలాంటి వేతనాలు రాబడి లేకుండా ప్రజలకు ప్రభుత్వాలకు ఉచిత సేవ చేస్తున్న నేపథ్యాన్ని యాదగిరి గుర్తు చేశారు. చిన్న మీడియా పెద్ద మీడియా అని తేడా లేకుండా అన్ని పత్రికల ద్వారా సేవలు పొందుతున్న ప్రభుత్వాలు కొంతమందికి మాత్రమే కొమ్ము కాయడం సరైన పద్ధతి కాదని ఇప్పటికైనా ప్రభుత్వాలకు చెంపపెట్టు లాంటి నిర్ణయం తీసుకున్న హైకోర్టు నిర్ణయాన్ని గౌరవించి అన్ని పత్రికలకు అన్ని మీడియాలకు సమాన విలువలను ఇచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మనస్సాక్షి శ్రీనివాస్... ఆర్టిఐ నిఘ పేపర్ నెమ్మది వెంకటేశ్వర్లు... మీడియా టుడే పేపర్ వీరబాబు... సూర్య ఛానల్ శ్రీనివాస్... తెలంగాణ టైమ్స్ శ్రీకాంత్. పవన్ కుమార్. పయనించే సూర్యుడు దినపత్రిక. 999, రిపోర్టర్ యాదవుల సైదులు, జనం న్యూస్ రిపోర్టర్ కందిబండ హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333