చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన హెడ్ కానిస్టేబుల్ లక్ష్మయ్య
మునగాల 30 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి :- మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో దాసరాజు పెద్ద లక్ష్మయ్య నేషనల్ హైవే పక్కన మంగళవారం చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రారంభించారు. నూతనకల్ మండలంలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తూ సొంత గ్రామంలో ప్రజలు, ప్రయాణికులు దాహర్తి తీర్చడం కోసం సొంతంగా చలివెంద్రాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ చిలుకూరు మండలం మాధవగూడెం, కొండాపురం, బేతవోలు గ్రామాల ప్రజలు ప్రాణికులు, ముకుందాపురం గ్రామస్తులు నేషనల్ హైవే వద్దకు వచ్చి హైదరాబాద్, వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తారని, హైవే పై వెళ్లే ప్రాణికులు త్రాగునీటీ ఇబ్బందులు కలగకుండా, ఉండేలా ఏర్పాటు చేశామన్నారు. గ్రామంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడే పెద ప్రజలకు అవసరాల నిమిత్తం ఆర్థిక సహాయం అందిస్తూ, దళిత కుటుంబంలో ఎవరైనా మృతి చెందినట్లయితే వారి కుటుంబాలకు 50 కేజీ ల బియ్యని కూడా అందిస్తున్నారు. ఆయన సేవలకు గ్రామస్తులు పలువురు అభింనందించారు.