చంద్రశేఖర్ ఆజాద్ ని యువత ఆదర్శంగా తీసుకోవాలి

Feb 27, 2024 - 20:02
 0  10
చంద్రశేఖర్ ఆజాద్ ని యువత ఆదర్శంగా తీసుకోవాలి

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ప్రతినిది.  చంద్రశేఖర్ ఆజాద్ ను యువకులు ఆదర్శoగా తీసుకొని ఉద్యమించాలి* *పివైఎల్ జిల్లా అధ్యక్షులు నల్గొండ నాగయ్య* బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వెన్నులో వణుకుపుట్టించి, దేశ ప్రజా విముక్తి కోసం వీరోచితంగా పోరాడిన విప్లవ వీర కిషోరo చంద్రశేఖర్ ఆజాద్ పోరాట వారసత్వం, ఆయన నడిచిన మార్గమే నేటి యువతకు, దేశ ప్రజలకు, రైతులకు ఆదర్శం అని చంద్రశేఖర్ ఆజాద్ మార్గంలో పయనించినపుడే అన్ని రకాల దోపిడీ, పీడనల నుండి సామాజిక అసమానతల నుండి విముక్తి కలుగుతుందని ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) జిల్లా అధ్యక్షులు నల్గొండ నాగయ్య యువతకు పిలుపునిచ్చారు. ఆత్మకూరు(ఎస్) మండల పరిధిలోని తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో మంగళవారం చంద్రశేఖర్ ఆజాద్ 93వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రశేఖర్ ఆజాద్ బ్రిటీష్ వాడి దోపిడీ, దౌర్జన్యాలు, దేశ సంపదను దోచుకుపోవడం, ప్రజల పౌర ప్రజాస్వామిక హక్కులను, స్వేచ్ఛను కాలరాసే దుర్మార్గపు విధానాలకు వ్యతిరేకంగా కామ్రేడ్ భగత్ సింగ్, రాజగురువు, సుఖ్ దేవ్ లతో పాటు చంద్రశేఖర్ ఆజాద్ బ్రిటీష్ పరాయి పాలన అంతం కోసం, ప్రజల విముక్తి కోసం పోరాడిన తీరు అద్భుతం అని అన్నారు. నేటి యువత చంద్రశేఖర్ ఆజాద్ అడుగుజాడల్లో నడుస్తూ నేడు దశాబ్ద కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న హిందూత్వ, మనువాద ఫాసిస్టు, ప్రజా, రైతు, కార్మిక, యువత వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ఆర్ ఎస్ ఎస్, బీ జే పీ మతోన్మాద మోడీ ప్రభుత్వాన్ని కూలదయాలని పిలుపునిచ్చారు. బడా కార్పోరేట్ సంస్థలకు అనుకూలమైన, మల్టీ నేషన్ కంపెనీలకు ఊడిగం చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాట పటిమను పుణికి పుచ్చుకుని దేశ విముక్తి కోసం పోరాడాలని, దేశ రైతాంగానికి గతంలో మోడీ ఇచ్చిన అనేక హామీలలో ముఖ్యమైనది కనీస మద్దతు ధరలకు చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడుతున్న రైతుల పట్ల అమానుషంగా, అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తూ, రైతులపై రకరకాల నిర్భందపు చర్యలకు పాల్పడుతూ, రైతులను హత్యలు చేస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ యువత ఉద్యమించాలని, రైతులకు, ప్రజలకు అండగా ఉండాలని, రైతులు సాగిస్తున్న న్యాయమైన పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో శిరీష, సంధ్య, లిఖిత్, మానశ్రీ, మధు తదితరులు పాల్గొన్నారు