ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి

Jul 11, 2026 - 20:26
 0  5
ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి

ఇటిక్యాల తహసిల్దార్  శ్రీకాంత్ రెడ్డి.  ఇటిక్యాల సూర్య న్యూస్.  ఓటరు జాబితా సమగ్ర సవరణ  ప్రక్రియను వావిలాల గ్రామంలో శనివారం పోలింగ్ స్టేషన్ నెంబర్ 48, 49లో బిఎల్ ఓ లు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

ఈ సందర్భంగా  తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ  బూత్ స్థాయిలో ఫారాల పంపిణీ, స్వీకరణ, డేటా ఎంట్రీ పురోగతిని సమీక్షించారు. ఫారాలు పంపిణీ చేయడం మాత్రమే కాకుండా, పూర్తిగా పూరించిన దరఖాస్తులను తిరిగి సేకరించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. 

ఒక్కో ఫారం డేటా ఎంట్రీకి ఎక్కువ సమయం పడుతున్న నేపథ్యంలో అవసరమైన చోట అదనపు సిబ్బందిని వినియోగించి సమయాన్ని కుదించి డాటా ఎంట్రీ ని పెంచాలని ఆయన  ఆదేశించారు.

ఇంటింటికీ వెళ్లి ప్రతి కుటుంబాన్ని సంప్రదించాలని, ఒక కుటుంబంలో ఒక సభ్యుడి మ్యాపింగ్ పూర్తయితే మిగిలిన అర్హులైన సభ్యులందరికీ మ్యాపింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని తాసిల్దార్ సూచించారు. ఇంకా ఫారాలు సమర్పించని కుటుంబాలను గుర్తించి ప్రత్యేకంగా ఫాలోఅప్ చేయాలన్నారు. మరణించిన, ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేసి, నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలన్నారు. 

బిఎల్ఓలు ఓటర్లతో
మర్యాదగా వ్యవహరించి మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైన సహాయం అందించాలని ఆయన సూచించారు. ఆయా వార్డుల, ఇతర ప్రజాప్రతినిధులు, అన్నిరాజకీయ పార్టీల ప్రతినిధులను ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. 

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చిన్న మోహన్ గౌడ్ బిఎల్ ఓ లు జిపిఓలు తదితరులు పాల్గొన్నారు


..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333