ఘనంగా  డాక్టర్ వూర రామ్మూర్తి యాదవ్ జన్మదిన వేడుకలు

Jun 25, 2026 - 19:51
 0  4
ఘనంగా  డాక్టర్ వూర రామ్మూర్తి యాదవ్ జన్మదిన వేడుకలు
ఘనంగా  డాక్టర్ వూర రామ్మూర్తి యాదవ్ జన్మదిన వేడుకలు

ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పండ్ల పంపిణీ

అపూర్వ బధిరుల పాఠశాలలో అన్నదానం

 రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు,శ్రీ కృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్, 18వ వార్డు కౌన్సిలర్, ప్రముఖ వైద్యులు డాక్టర్ వూర రామ్మూర్తి యాదవ్ జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంలోని ఆయన నివాసం లో గురువారం పలువురు నాయకులు, అభిమానులు కేక్ కట్,బొకేలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం  పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులకు పండ్లను పంపిణీతోపాటు, కాసరబాద రోడ్ లోని అపూర్వ బధిరుల పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు అన్నదానం వితరణ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సుదీర్ఘకాలం పేదలకు వైద్య సేవలు అందిస్తూ ప్రజాసేవలో నిరంతరం సేవా దృక్పథంతో పనిచేస్తున్నారని అన్నారు. వైద్య వృత్తిలో పేదల పెన్నిధిగా ఎంత ఎదిగినా ఒదిగే ఉండటం ఆయన నైజం అని అందరూ నావాల్లే అంటూ వైద్య రంగంలో, అటు రాజకీయ రంగంలో  రాణిస్తూ భవిష్యత్తులో అన్ని వర్గాల గొంతుకై ఉన్నత పదవులు పొందాలని మరెన్నో పుట్టినరోజులు జరుపుకొని ప్రజలకు నిరంతరం సేవలు అందించాలని కోరారు. వైద్య వృత్తిలో ప్రముఖ వైద్యులుగా రాణిస్తూ శ్రీకృష్ణ ట్రస్ట్ ద్వారా ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులకు, పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.  కార్యక్రమంలో అఖిలభారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు మర్యాద సైదులు యాదవ్, లింగమంతుల దేవస్థానం చైర్మన్ పోలెబోయిన నర్సయ్య యాదవ్, కౌన్సిలర్ జ్యోతి శ్రీ విద్యా కరుణాకర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు యలగబోయిన మధు యాదవ్, మాజీ కౌన్సిలర్లు నిమ్మల వెంకన్న, మాలోతు కమల్ చంద్రు నాయక్, నాయకులు బోల్క వెంకట్, వీర బోయిన లింగయ్య యాదవ్, తూము వెంకన్న, కోడి లింగయ్య,బడుగుల సైదులు, కంచుగట్ల జానయ్య, ఉగ్గం వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333