ఘనంగా ఎర్ర జెండా ముద్దుబిడ్డ పోరెల్ల మహేష్ 11 వ వర్ధంతి

Mar 22, 2024 - 19:06
 0  122
ఘనంగా ఎర్ర జెండా ముద్దుబిడ్డ పోరెల్ల మహేష్ 11 వ వర్ధంతి

తిరుమలగిరి 23 మార్చి 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

 శుక్రవారం తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో కామ్రేడ్ పోరెళ్ల మహేష్ పదకొండవ వర్ధంతి మహాసభ ను సిపిఐ గ్రామ శాఖ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్లముల పాల్గొని యాదగిరి మాట్లాడుతూ పోరెళ్ల మహేష్ తన జీవితకాలం మొత్తం కూడా ఎర్రజెండా పార్టీ కోసం అహర్నిశలు పనిచేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆకలి, దప్పిక లు మరిచి పోరాటాలు చేశారని, ఆయన స్ఫూర్తి నేటి యువతరానికి ఆదర్శం అని అన్నారు. పోరెళ్ల మహేష్ బాల్యం నుంచి కూడా అనేక కష్టాలను ఎదుర్కొన్నారని, చిన్న వయసులోనే గొప్ప పేరు సంపాదించుకున్న వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి తిపిరాల శ్రీకాంత్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా బాధ్యులు ఎండి ఇక్బాల్, ప్రజానాట్యమండలి జిల్లా బాధ్యులు జంపాల మల్లయ్య,గ్రామ శాఖ కార్యదర్శి కనుక అశోక్, 2వ మాజీ వార్డు నెంబర్ ఎల్లంల కొమురెల్లి, సుంచు సత్తయ్య, నాగుల గాని మల్లయ్య,కుదురుపాక ఉప్పలయ్య, ఎల్లముల కొమురయ్య, ముత్యాల యాకన్న, కాసాని సతీష్,

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034