మహిళలు స్వయం ఉపాధి పై రాణించాలి
మహిళలు స్వయం ఉపాధి పై రాణించి ఆర్థికంగా ఎదగాలని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పాత మున్సిపల్ కాంప్లెక్స్ లో ఎలక్ట్రిక్ డ్రై క్లీనింగ్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించి తన ప్రతిభను చాటుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్నిమ్మల శ్రీనివాస్ గౌడ్ 25వ వార్డ్ కౌన్సిలర్ ఆకుల కవిత లవకుశ,బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు బత్తుల రమేష్, సల్మా,అంజమ్మ, యజమాని కరుణశ్రీ శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.