అన్న అంటే నేనున్నాను అని చిన్నారి సమస్య పై స్పందించి వారం రోజుల్లోనే హార్ట్ సర్జరీ చేయించిన జారే
దమ్మపేట మండలం, మొద్దులగూడెం గ్రామానికి చెందిన మల్కాపురం నాగులు మనవరాలు జ్యోత్స్న చిన్న వయసులోనే గుండె సమస్య తో బాధపడుతుంది. తన పేదరికం వలన సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతూ అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ గారిని గండుగులపల్లి లోని వారి క్యాంపు కార్యాలయంలో కలిసి చిన్నారి గుండె జబ్బు గురించి వివరించిన వెంటనే నేనున్నాను అని అధైర్య పడవద్దని పాప ఆరోగ్యం బాధ్యత తీసుకుంటాను అని చెప్పి మాట ఇచ్చిన విధంగానే ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రెండు లక్షల రూపాయలు LOC ఇప్పించి వారం రోజుల్లో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో హార్ట్ సర్జరీ చేయించి చిన్నారి జీవితంలో వెలుగులు నింపటం జరిగింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజల పట్ల జారే ఆదినారాయణ గారు ప్రత్యేక చొరవ తీసుకుని వైద్యం చేయిస్తున్నారని అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కరు కూడా వైద్యం చేయించుకునే విషయంలో ఇబ్బందికి లేకుండా ఉండేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు అని కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం అని ప్రజల సంక్షేమం పట్ల బాధ్యతగా వ్యవహరించే ప్రభుత్వం అని చిన్నారి జ్యోత్స్న ఆరోగ్య పరిస్థితి పై వెంటనే స్పందించి సర్జరీ చేయించిన జారే గారికి వారి కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.