మద్యం మత్తులో రోడ్డు ప్రమాదానికి కారణం అయితే గరిష్ఠంగా 10 సంవత్సరాల జైలు శిక్ష.

Mar 13, 2024 - 20:36
 0  8
మద్యం మత్తులో రోడ్డు ప్రమాదానికి కారణం అయితే గరిష్ఠంగా 10 సంవత్సరాల జైలు శిక్ష.

- సామర్ధ్యానికి మించి రవాణా చేయడం నేరము, ప్రమాదం.
- ఆజాగ్రత్త వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు.
- ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్త పాటించడం ముఖ్యం.
- రెండు రోడ్డు ప్రమాదాల కేసుల్లో నిందితులకు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగినది.

...రాహుల్ హెగ్డే ఐపిఎస్ గారు, ఎస్పి సూర్యాపేట.

జిల్లాలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు వాహనదారుల, ప్రజల అజాగ్రత్త వల్లనే ఎక్కువగా నమోదవుతున్నాయని, వాన దారులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు మరియు రోడ్డు నియమ నిబంధనలు పాటించడం ద్వారానే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపిఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపినారు. ప్రమాదాలకు గల కారణాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి లోపాలను సవరిస్తున్నామని అన్నారు. జిల్లాలో అన్ని రహదారులపై 2023 సంవత్సరం జనవరి నేలనుండి ఇప్పటి వరకు 687 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి, ఇందులో 302 మంది మృత్యువాత పడగా 646 మంది క్షతగాత్రులు అయ్యారు, ఈ గణాంకాలు కలవరపాటు పెడుతున్నాయని, ప్రజలు వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండి రహదారి భద్రత నియమ నిబంధనలు పాటించాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చు అని ఎస్పీ గారు తెలిపినారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి మైనర్స్ కు వాహనాలు ఇవ్వవద్దు అని కోరినారు.

రోడ్డు ప్రమదాలకు కారణం అయిన వారికి జైలు శిక్షలు పడుతున్నాయి, మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదానికి కారకులైతే గరిష్ఠంగా 10 సం. ల వరకు జైలు శిక్షలు పడతాయని ఎస్పీ గారు తెలిపినారు. సూర్యాపేట రూరల్, సూర్యాపేట పట్టణ పరిధిలో జరిగిన తీవ్రమైన రోడ్డు ప్రమాదాలలో నిందితులకు 1 సంవత్సరం పాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది అని ఎస్పీ గారు ఈ సందర్బంగా గుర్తు చేశారు.
ఎక్కువగా మానవ తప్పిదాలు, నిర్లక్ష్యం, అజాగ్రత్తవల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ ప్రమాదాలను నివారించడం ప్రతిఒక్కరి బాధ్యత. సామర్ధ్యానికి మించి రవాణా చేయడం, మద్యం తాగి వాహనం నడపడం నేరం అని తెలిపినారు.
రోడ్డు భద్రత నియమాలు, పోలీసు సూచనలు పాటించాలి.
- మద్యం సేవించి వాహనాలు నడపవద్దు.
- హెల్మెట్, సీటు బెల్ట్ విధిగా ధరించాలి.
- అధికవేగం తో వాహనం నడపవద్దు.
- వాహన సామర్ధ్యానికి మించి రవాణా చేయవద్దు.
- రాంగ్ పార్కింగ్ , రాంగ్ రూట్ ప్రయాణం చేయవద్దు.
- ట్రిపుల్ రైడింగ్, బైక్ రేసింగ్ చేయవద్దు.
- గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించవద్దు.
- సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దు.
- రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు పార్కింగ్ చేయవద్దు.
- రైతులు రోడ్లపై ధాన్యం పోయవద్దు.
- ట్రాక్టర్ దమ్ము చక్రాలతో రోడ్లపైకి రావొద్దు.
- పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దు.
- నిద్రమత్తులో డ్రైవింగ్ చేయవద్దు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333