**పోలీస్ ప్రజా భరోసా*సైబర్ నేరాలు గంజాయి డ్రగ్స్ నియంత్రణపై పోలీస్ కళాజాత*

తెలంగాణ వార్త ప్రతినిధి*సైబర్ నేరాలు, గంజాయి డ్రగ్స్ నియంత్రణపై పోలీస్ కళాజాత*
ఎస్పీ కె నరసింహ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు నాగారం SI ఐలయ్య మండల కేంద్రంలోనీ సంత బజారులో సైబర్ నేరాలపైన, అన్ లైన్ బెట్టింగ్, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాభృందంతో ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.
*SI ఐలయ్య* మాట్లాడుతూ ఎస్పీ కె. నరసింహ IPS గారి ఆదేశాల మేరకు ప్రజలకు పోలీసుకు మైత్రి కలిగి ఉండాలని *పోలీస్ ప్రజా భరోసా* కార్యక్రమాన్ని గ్రామ పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసినారు.
- ప్రజల రక్షణ భద్రత కోసం పోలీసు ఉందన్నారు.
- గ్రామంలో ప్రశాంత వాతావరణం, శాంతిభద్రతలు అదుపులో ఉంటే గ్రామాలు అభివృద్ధి పథంలో నడుస్తాయన్నారు.
- గ్రామంలో వర్గాలుగా ఏర్పడి ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటే గ్రామం అభివృద్ధి చెందదు.
- మన గ్రామ వాతావరణం మన పిల్లల, యువత భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది.
- సమస్యాత్మక గ్రామంగా పోలీసు రికార్డ్ లలో ఒకసారి నమోదైతే పేరు ఎప్పటికీ అలాగే నిలిచి పోతుంది.
- పెద్దలను చూసి యువత అదే మార్గంలో నడుస్తుంది.
- సమస్యలు సృష్టిస్తారు, గొడవలు పాల్పడతారు అని ఒక వ్యక్తిపై రౌడీ షీటర్, సస్పెక్ట్ షిటర్ గా పోలీసు రికార్డ్ లో నమోదైతే జీవితకాలం ముద్ర అలాగే ఉంటుంది.
- ఎలాంటి అల్లర్లు జరిగిన, ఎన్నికల సమయం వచ్చిన సమస్యలు సృష్టించే వ్యక్తిని ప్రతి సారి బైండోవర్ చేస్తాము.
- మీ ఇంటికి ఎన్నికల సమయంలో, ఇతర అత్యవసర సమయంలో పోలీసు వారు వచ్చి దర్యాప్తు చేస్తున్నారు అంటే మీకు చెడు పేరు వస్తుంది.
- యువత ఒక్కసారి కేసుల్లో చిక్కుకుంటే భవిష్యత్తులో ఉద్యోగాలు పొందే విషయంలో, విదేశాలకు వెళ్లే విషయంలో, పాస్ పోర్ట్, విసా పొందే విషయంలో పోలీసు అనుమతులు ఇవ్వబడవు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
- మహిళలను గౌరవించాలి, మహిళా రక్షణలో చట్టాలు బలోపేతం చేయబడ్డాయి, మహిళలను, పిల్లలను వేదిస్తే షీ టీం నెంబరు 8712686056 కి ఫిర్యాదు చేయవచ్చు కేసులు నమోదు చేసి శిక్షలు పడేలా పోలీసు దర్యాప్తు ఉంటుంది.
- ఉచిత భాహుమతులు, తక్కువ రేటుకు వస్తువులు వస్తాయి, లాటరీ వచ్చినది, తక్కువ వడ్డీ లోన్ లు ఇస్తాము, డబ్బులు కడితే ఉద్యోగం ఇస్తాము, తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభం వస్తుంది ఇలాంటివి ఎవరైనా అపరిచితులు ఫోన్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, మెసేజ్ ల ద్వారా తెలిపితే నమ్మి అత్యాశకు పోయి సైబర్ మోసాలకు గురై డబ్బులు పోగొట్టుకోవద్దు.
- బెట్టింగ్ ప్రకటనలు నమ్మి డబ్బులు బెట్టింగ్ పెట్టవద్దు, అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవద్దు. అశ్లీలపు వీడియో కాల్స్ మాట్లడి ప్రాణలమీదకు తెచ్చుకోవద్దన్నారు.
- రోడ్డు ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి, మద్యం తాగి వాహనాలు నడపవద్దు, పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దు.
- గంజాయి లాంటి మాదకద్రవ్యాలు మన గ్రామంలోకి రానివ్వద్దు, ఎవరైనా డ్రగ్స్ కు అలవాటు పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
- గ్రామంలో ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేయవద్దు. PDS బియ్యంతో అక్రమ వ్యాపారం చేయొద్దు.
- పేకాట, బెట్టింగ్ లాంటి, బహిరంగంగా మద్యం తాగడం లాంటి అసాంఘిక చర్యలకు పాల్పడవద్దు. వీటిపై పోలీసుకు సమాచారం ఇవ్వాలి.
- శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో మూఢనమ్మకాలు నమ్మవద్దన్నారు.
-
ఈ కార్యక్రమం నందు హెడ్ కానిస్టేబుల్ వెంకన్న కానిస్టేబుల్ శ్రీనివాస్,నరేష్,కమలాకర్, హోంగార్డు వీరన్న పోలీస్ కళాబృందం ఇన్చార్జి యల్లయ్య,గోపయ్య,చారి, కృష్ణ, గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.