గద్వాల్ రూరల్ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ.. సేవాభావంతో ప్రజల విశ్వాసమే పోలీసింగ్‌కు బలం: జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు 

Jul 21, 2026 - 17:37
 0  1
గద్వాల్ రూరల్ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ.. సేవాభావంతో ప్రజల విశ్వాసమే పోలీసింగ్‌కు బలం: జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు 

 స్టేషన్ పరిశుభ్రత, రికార్డులు, సిబ్బంది కిట్, క్రైమ్ వాహనాల తనిఖీ.. నూతన కాంపౌండ్ వాల్, పార్కింగ్ షెడ్  ప్రారంభం 
 
 ⟹   నాణ్యమైన దర్యాప్తు, కమ్యూనిటీ పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం తో నేరాల నియంత్రణకు ఎస్పీ దిశానిర్దేశం      
 
 జోగులాంబ గద్వాల 21 జూలై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : వార్షిక తనిఖీలలో భాగంగా మంగళవారం గద్వాల్ రూరల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి, పోలీసుల సిబ్బంది గౌరవ వందనం స్వీకరించి, పార్కింగ్ షెడ్, న్యూ కాంపౌండ్ వాల్ లను ఇనాగ్రేషన్ చేయడoతో పాటు, మెన్ యూనిఫామ్ టర్న్ ఔట్,  కిట్ ఆర్టికల్స్, స్టేషన్ రికార్డ్స్, పరిసరాలను జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐ. పి. ఎస్.,  గారు తనిఖీ చేశారు.  పోలీసు ఉద్యోగం కేవలం విధి నిర్వహణ మాత్రమే కాకుండా, అది ప్రజల పట్ల ఉన్న బాధ్యత, సేవా భావం, మరియు చట్ట పరిరక్షణ అధికారాల సమన్వయంతో కూడిన పవిత్రమైన సేవ అని జిల్లా ఎస్పీ తెలిపారు.

 ఈ సందర్భంగా గద్వాల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిసరాల శుభ్రత, సిబ్బంది బ్యారెక్స్,  స్టేషన్ రికార్డుల మెయింటేనెన్స్ ను పరిశీలించారు. సిబ్బంది కిట్ ఆర్టికల్స్ తనిఖీ చేస్తూ.. కిట్ ఆర్టికల్స్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న స్వాధీనం చేసుకున్న/ కేసులో ఉన్న వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ రికార్డులను తనిఖీ చేస్తూ ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును చేయాలని, ఆస్థి సంబంధిత నేరాలకు సంబంధించి, అధిక నేరాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పార్ట్స్ లు గా గుర్తించి, పగలు, రాత్రి బీట్ డ్యూటీల ద్వారా నిఘా కట్టుదిట్టం చేయాలని సూచించారు.  రిసెప్షన్ సిబ్బంది స్టేషన్ కు వచ్చిన ప్రతి దరఖాస్తును ఆన్లైన్ లో నమోదు చేయాలని, ఫిర్యాదిదారులతో మర్యాదగా మాట్లాడాలని అన్నారు.  పోలీస్ అధికారులు తమకు కేటాయించిన గ్రామాలపై  పూర్తి అవగాహన ఉండాలని, గ్రామ పెద్దలతో, యువతతో సత్సంబంధాలు కలిగి ఉండాలని అన్నారు. స్టేషన్ పరిధిలో గల రౌడీ, సస్పెక్ట్,  హిస్టరీ షీటర్లను చెక్ చేస్తూ ఆన్లైన్ రికార్డులో నమోదు చేయాలన్నారు. ఇతర ప్రాంతాల్లో ఉండే వారి షీట్స్ ను సంబంధిత ప్రాంతాలలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ లకు పంపాలని తెలిపారు.

  అలాగే పాపిలోన్ డివైస్ ను వినియోగించి అనుమానిత వ్యక్తుల వేలిముద్రలను చెక్ చేస్తూ.. పాత నేరస్తులను గుర్తించాలని అన్నారు. నేరాల అదుపు, జరిగిన నేరాలను ఛేదించడంలో ఉపయోగపడే సిసి కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ.. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలని అన్నారు. 

స్టేషన్ రికార్డులైన ఎస్.సి.ఎచ్. పార్ట్ 1 – 5, జనరల్ డైరీ, ఎఫ్.ఐ.ఆర్. ఇండెక్స్, ఆల్ఫాబీటికల్ ఇండెక్స్, డ్యూటీ రోస్టర్, విస్టింగ్ నోట్ బుక్స్, రౌడీ, సస్పెక్ట్ షీట్స్, గన్ లైసెన్స్ రిజిస్టర్, ఎల్.ఎల్.ఐ., గవర్నమెంట్ ప్రాపర్టీ రిజిస్టర్, ప్రాసెస్ రిజిస్టర్,    మొదలగున్నవి చెక్ చేసి  సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బందికి వర్టికల్ వారీగా విధులను కేటాయించాలని ఎస్సై కి సూచించడం జరిగింది. రోడ్డు ప్రమాదాల నివారణకు, సైబర్ నేరాల నివారణకు వివిధ స్కూల్స్ కళాశాలలు, పని ప్రదేశాలలో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అవగాహన కల్పించాలని అన్నారు. విజిబుల్ పోలీసింగ్‌ లో భాగంగా ప్రతి రోజు వాహానాల తనిఖీ నిర్వహిస్తూ, ట్రాఫిక్ నియమాలు పాటించని వాహనదారులపై చర్యలు తీసుకోవాలని, అనుమానిత వాహనాలను అదుపులోకి తీసుకోవాలని అన్నారు.

 బ్లూ కోల్ట్స్ సిబ్బంది ప్రతి పాయింట్ ను తనిఖీ చేయాలని, డయల్ -100 కాల్స్ కు త్వరితగతిన స్పందించాలని సూచించారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకువచ్చిన సీసీటీఎన్ఎస్ - 2.0, పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్,  టీఎస్-కాప్, ఈ-సాక్ష్య, టెక్ డాటం, ఐరాడ్ దర్పణ్, సీఈఐఆర్, సైబర్ క్రైమ్‌ నేరాల నియంత్రణ, సీడీఆర్, సిఇఐఆర్ పోర్టల్, పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్, బాడీ ఓన్ కెమెరాల వంటి సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లు నేరాల అదుపునకు, జరిగిన నేరాలను ఛేదించడానికి ఉపయోగకరంగా ఉన్నాయి. ఇట్టి   అప్లికేషన్ల పై పూర్తి స్థాయిలో పట్టు సాధించి, నేరాల నియంత్రణలో కీలకంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించడం జరిగింది, ఇప్పుడు నేర్చుకున్న పని మీ సర్వీస్ మొత్తం ఉపయోగపడుతుందన్నారు. 

సిబ్బంది తో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..... పోలీసు ఉద్యోగం కేవలం విధి నిర్వహణ మాత్రమే కాకుండా, అది ప్రజల పట్ల ఉన్న బాధ్యత, సేవా భావం, మరియు చట్ట పరిరక్షణ అధికారాల సమన్వయంతో కూ…

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333