రోడ్ల ఆక్రమణలు తొలగించడం వాహనదారులకు పాదాచార్యులకు సౌకర్యం కల్పించడం

Apr 11, 2026 - 07:10
Apr 11, 2026 - 07:11
 0  1
రోడ్ల ఆక్రమణలు తొలగించడం వాహనదారులకు పాదాచార్యులకు సౌకర్యం కల్పించడం
రోడ్ల ఆక్రమణలు తొలగించడం వాహనదారులకు పాదాచార్యులకు సౌకర్యం కల్పించడం

సూర్యాపేట, 10 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– సూర్యాపేట పట్టణంలో ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది వ్యాపారస్తులు రోడ్ల ను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించకూడదని సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య తెలిపారు. 

జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ రెగ్యులేషన్, ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి ఆపరేషన్ రోప్ కార్యక్రమంలో భాగంగా నియంత్రణ చర్యలు చేపట్టడం జరిగింది అని పట్టణ సీఐ వెల్లడించారు. రోడ్ల ఆక్రమణలు తొలగించడం వాహనదారులకు పాదాచార్యులకు సౌకర్యం కల్పించడం ఈ ఆపరేషన్ లోపు యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. దీనిలో భాగంగా ఈరోజు సూర్యాపేట టౌన్ కొత్త బస్టాండ్ ప్రాంగణంలో వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు రోడ్లపైకి వచ్చి వ్యాపారాలు నిర్వహిస్తూ సామాన్య ప్రజలకు వాహనదారులకు ఇబ్బందులు కలిగించకూడదని కోరారు. రోడ్ల ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని రోడ్లు ఇరుకుగా తయారవుతున్నాయని అసౌకర్యాలకు గురవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333