గద్వాల ట్రాఫిక్ వింగ్‌ను ఆకస్మికంగా తనిఖీచేసిన జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు

Jun 20, 2026 - 22:59
 0  0
గద్వాల ట్రాఫిక్ వింగ్‌ను ఆకస్మికంగా తనిఖీచేసిన జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు
గద్వాల ట్రాఫిక్ వింగ్‌ను ఆకస్మికంగా తనిఖీచేసిన జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు

గద్వాల ట్రాఫిక్ వింగ్‌ను ఆకస్మికంగా తనిఖీచేసిన జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్.,

క్రమశిక్షణ, నీట్ టర్నౌట్, సమర్థవంతమైన విధుల నిర్వహణపై సిబ్బందికి దిశానిర్దేశం.

జోగుళాంబ గద్వాల 20 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, ఈ రోజు గద్వాల టౌన్ ట్రాఫిక్ వింగ్‌ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ వింగ్ పరిసరాలు, వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, సిబ్బంది విధుల నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు.

 అనంతరం ట్రాఫిక్ సిబ్బందితో నేరుగా మాట్లాడి వారి బాధ్యతలు, రోజువారీ విధుల గురించి ఆరా తీశారు. ట్రాఫిక్ ఆర్‌ఎస్‌ఐ బాలచంద్రుడిని రోజువారీ డ్యూటీల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై అడిగి తెలుసుకున్న ఎస్పీ , ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో ట్రాఫిక్ విభాగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ట్రాఫిక్ పోలీసుల ఆటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్, యూనిఫాం ధరించే తీరు (నీట్ టర్నౌట్), క్రమశిక్షణ నేరుగా పోలీస్ శాఖ ప్రతిష్ఠను ప్రతిబింబిస్తాయని అన్నారు. ప్రతి పోలీసు సిబ్బంది ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ, కమిట్‌మెంట్‌తో విధులు నిర్వర్తించాలని సూచించారు. అదేవిధంగా ట్రాఫిక్ వింగ్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి సిబ్బంది తమకు కేటాయించిన ట్రాఫిక్ పాయింట్లలోనే అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. రద్దీ సమయాల్లో ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రిస్తూ, రోడ్డు వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తనిఖీలో  గద్వాల డీఎస్పీ వై. మొగిలయ్య, గద్వాల సీఐ టంగుటూరి శ్రీను, ట్రాఫిక్ వింగ్ ఆర్‌.ఎస్‌.ఐ. బాలచంద్రుడు మరియు ట్రాఫిక్ వింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333