అయిజ పోలీస్ స్టేషన్‌కు రాజకీయ గ్రహణం

Jun 20, 2026 - 23:01
 0  0
అయిజ పోలీస్ స్టేషన్‌కు రాజకీయ గ్రహణం

అలంపూర్ నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్న అధికార పార్టీ నేతపై బహిరంగ చర్చ

జోగులాంబ గద్వాల 20 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- పట్టణ పోలీస్ స్టేషన్ రాజకీయ ఒత్తిళ్లకు వేదికగా మారుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీస్ స్టేషన్‌కు రాజకీయ గ్రహణం పట్టిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం  తరచూ సబ్-ఇన్‌స్పెక్టర్లు (ఎస్సైలు) మారడమే.

అలంపూర్ నియోజకవర్గంలో ఆ నేత హవా?

అయిజ పోలీస్ స్టేషన్ పరిధిలో అలంపూర్ నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ముఖ్య నేత ఒకరు తెరవెనుక ఉండి మొత్తం చక్రం తిప్పుతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. సదరు నేత చెప్పినట్లే ఇక్కడ పోలీస్ యంత్రాంగం నడుచుకోవాలనే ఒత్తిళ్లు ఉన్నాయని, ఆ నాయకుడి కనుసన్నల్లోనే బదిలీల పర్వం సాగుతోందని నియోజకవర్గంలో ఇప్పుడు బహిరంగంగా చర్చ జరుగుతోంది.

చెప్పినట్టు వినకపోతే వీఆర్‌కే!

ఇక్కడికి వచ్చే అధికారులపై అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు తీవ్రంగా ఉంటున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాము చెప్పినట్లు వినని అధికారులను లూప్ లైన్‌కు లేదా వీఆర్‌ (వేకెన్సీ రిజర్వ్)కు పంపించడం, లేదంటే ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించడం సదరు నాయకులకు మంచినీళ్లు తాగినంత సులువుగా మారిందని విమర్శిస్తున్నారు. 

కీలుబొమ్మగా మారిన పోలీస్ వ్యవస్థ...ప్రజల్లో అసంతృప్తి

రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాలు మరియు మితిమీరిన జోక్యం వల్ల ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ రక్షణ కల్పించాల్సిన పోలీస్ వ్యవస్థ, కొంతమంది చేతిలో కీలుబొమ్మగా మారుతోందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారుల వరుస బదిలీల వల్ల స్థానిక సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని, శాంతిభద్రతలపై దీని ప్రభావం పడుతోందని పట్టణ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333