గట్టు అభివృద్ధి కోసం, భారత్ మాల రోడ్డు నిర్మాణ పనులకు రైతులు సహకరించాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ అన్నారు

Aug 22, 2024 - 18:08
Aug 22, 2024 - 18:08
 0  1
గట్టు అభివృద్ధి కోసం, భారత్ మాల రోడ్డు నిర్మాణ పనులకు రైతులు సహకరించాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ అన్నారు

  గురువారం గట్టు మండల తహసీల్దార్ కార్యాలయంలో హైవే అథారిటీ అధికారులతో రహదారి నిర్మాణం సంబంధిత భూముల  వివరాలను, భారమాత రహదారి మాపింగ్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు.   అనంతరం రైతులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రహదారి నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించడంతో పాటు, మిగులు భూములకు సర్వీస్‌రోడ్లు, బ్రిడ్జి ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని, రైతులకు నష్టపరిహారం క్రింద రైతుల కోరిక మేరకు రెండో విడతగా పది రోజులలో డబ్బులను  అందేలా తక్షణమే చర్యలు తీసుకుంటామని అన్నారు. సర్వే నెంబర్ 300 మాచర్ల  నుండి అరగిద్దకు రోడ్డు లింక్  కల్పిస్తామన్నారు. బ్రిడ్జి ,అండర్ పాస్ లు ఏర్పాటు  చేస్తామని అన్నారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కను నాటడం జరిగింది.   
      
 ఈ కార్యక్రమంలో తహసీల్దార్  సరిత రాణి, ఎన్.హెచ్.ఎ.ఐ  మేనేజర్ కోట బాబు, సంబంధిత  అధికారులు,  రైతులు, తదితరులు పాల్గొన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333