బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపు మేరకు ఐజ మండల కేంద్రంలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ ధర్నా విజయవంతం.
రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే రుణమాఫీ చేయాలి
అందరికీ రుణమాఫీ చేసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వం పైన మా పోరాటం ఆగదు
జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య
ధర్నాకి వెళ్లే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లిని ఉద్దేశించి మాట్లాడిన చిల్లర మాటలకు నిరసనగా తెలంగాణ చౌరస్తా లో తెలంగాణ తల్లికి నాయకులు రైతులతో కలిసి పాలాభిషేకం చేసి ధర్నా లో పాల్గొనడం జరిగింది.
ఐజ మండల కేంద్రంలో తెలంగాణ తల్లి చౌరస్తా నుంచి పెట్రోల్ బంక్ చౌరస్తా వరకు ర్యాలీ గా వెళ్లి ధర్నా చేయడం జరిగింది ఈ కార్యక్రమం జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ దేవన్న, సింగిల్ విండో చైర్మన్ మధుసూదన్ రెడ్డి మేరమ్మ, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి,నియోజకవర్గం నాయకురాలు ప్రేమలత పల్లయ్య, తొత్తి నోనీ దొడ్డి మాజీ సర్పంచ్ శివకుమార్, బైనపల్లి మాజీ సర్పంచ్ రామలింగం, నవ రోజు క్యాంపు మాజీ సర్పంచ్ భద్రయ్య, కుటకనూరు మాజీ సర్పంచ్ బిందాస్, జిల్లా మాజీ వక్ బోర్డు చైర్మన్ జమాలుద్దీన్, బైనపల్లి ముక్తార్, తాండ్రపాడు మల్లేష్, పెద్దొడ్డి నరసింహులు, సంకాపురం ఈశ్వరన్న, మల్లేష్,గోవర్ధన్, మరియు బీఆర్ఎస్వి నాయకులు మత్తాలి, ఐజ వీరేష్,తుప్పరతాల వీరేష్, తూముకుంట అనిల్ మరియు రైతులు జితేందర్ రెడ్డి, దుబ్బన్న శ్రీనివాసులు ఎల్లయ్య తిమ్మారెడ్డి రవికుమార్ కుతుబుద్దీన్ సత్తన్న పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు
ఈ సందర్బంగా బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య మాట్లాడుతూ...
చెప్పింది కొండంత.. చేసింది రవ్వంత..
రైతు నోట్లో మట్టి కొట్టిన రౌడీ సీఎం డౌన్ డౌన్..
చెప్పింది 31వేల కోట్లు... చేసింది 17,933 కోట్లు మాత్రమే.
రైతులను నట్టేట ముంచిన సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి.
రైతులను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో 2లక్షల రైతు రుణమాఫీ మరియు ఆరు గ్యారెంటీలో అమలు చేస్తాం అని చెప్పి ప్రజలను మోసం చేసారు.
హరీష్ రావు గారిని విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డి ది కాదు..
హరీష్ రావు గారు ఆగస్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ తో పాటు ఆరు గ్యారంటీలో అమలు చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చాలా వివరంగా చెప్పారు...
రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు పూర్తిస్థాయిలో 2లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి సగం రైతులకే మాఫీ చేయడం చాలా దురదృష్టం...
31వేల కోట్ల రుణమాఫీ చేస్తా అని చెప్పి 17వేల కోట్ల రుణమాఫీ చేసింది...
మా పార్టీ తరుపున రైతు రుణమాఫీ కాని వారు కోసం హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేస్తే దాదాపు 90 వేల మంది రైతులు రుణమాఫీ కాలేదని చెప్పారు.