కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో పుడమి సంఘం నాయకులు ఎంపిక

Sep 27, 2024 - 18:53
Sep 27, 2024 - 18:56
 0  50
కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో పుడమి సంఘం నాయకులు ఎంపిక

కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో పుడమి సంఘ నాయకుల ఎంపిక

సూర్యాపేట : జిల్లాలో తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ వారు మరియు సీజీఆర్ సంస్థ వారు ఎంపిక చేసిన పాఠశాలల్లో స్కూల్‌ ఎర్త్‌ క్లబ్స్ - యంగ్‌ ఎర్త్‌ లీడర్స్ ప్రోగ్రాం లో భాగంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ యానాల వెంకట్ రెడ్డివారి బృందం ఆధ్వర్యంలో 6వ తరగతి నుండి 9వ తరగతి పిల్లలను ఒక్కో తరగతికి ఇద్దరి చొప్పున లీడ్ ఎర్త్‌ లీడర్స్ (పుడమి నాయకులు)గా ఎన్నుకొని కమిటీలు వేయడం జరిగింది.ఈ కమిటీలు పర్యావరణ పరిరక్షణ లో భాగంగా పిల్లలు అందురు భాగస్వామ్యలు అయ్యారు. భావి తరాలకు ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత పిల్లల నుండి మొదలు పెడితే ఇంకా ప్రయోగాత్మకంగా ఉంటుంది. మనం మట్టి,గాలి, నీరు కు నిత్యం సంబందం కలిగి ఉన్నాం. ఇవి లేకపోతే మానవుని మనుగడ లేదని మొక్కల రక్షణ, మొక్కలు పెంచే విధానం, ఔషద మొక్కల ఉపయోగం పై అవగాహణ కల్పించారు. ప్రతి పిల్లవానికి మొక్కలపై అవగాహన కలిగి ఉండి,ప్లాస్టిక్ నివారణ, మొక్కల రక్షణ, నీటిని నిల్వచేయడం వంటి పలు అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించి పుడమి నాయకులను తయారు చేశారు ఇందులో భాగంగా లీడ్ ఎర్త్ లీడర్స్ లకు బ్యాడ్జ్ లను పెట్టి బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమాన్ని టీ. జీ.ఎం.ఎస్ ఇమాంపేట, జడ్.పి.హెచ్.ఎస్ చివ్వెంల , జడ్.పి.హెచ్.ఎస్ అనాజిపురం, జడ్.పి.హెచ్.ఎస్ సూర్యాపేట, జడ్.పి.హెచ్.ఎస్ ఏపూరు, జడ్.పి.హెచ్.ఎస్ నామవరం, జడ్.పి.హెచ్.ఎస్ జలాల్ పురం పాఠశాలల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు,ఉపాధ్యాయుల బృందం, సిజిఆర్ బృందం నుండి అడ్మిన్ ఆఫీసర్ పుప్పాల అనుదీప్, ప్రోగ్రాం ఆఫీసర్ పాలడుగు నగేష్, జిల్లా కోఆర్డినేటర్ మామిడి శంకరయ్య,లీడ్ ఎర్త్ లీడర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223